టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణికి వేధింపులు.. కేసు బుక్ చేసిన హైదరాబాద్ పోలీసులు

Fri Aug 12 2022 18:27:32 GMT+0530 (IST)

Table Tennis Player Naina Jaishwal Was Being Harassed By A Young Man

ఆమె ఏమీ సాదాసీదా అమ్మాయి కాదు. పేరున్న క్రీడాకారిణి. అలాంటి ఆమెను వేధింపులకు గురి చేస్తే పోలీసులు చాలా వేగంగా రియాక్టు అవుతారు. ఒకసారి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత అతగాడిలో మార్పు రావటమేకాదు.. ఆమె వంక చూసేందుకు ఇష్టపడరనని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. తాజాగా వెలుగు చూసిన వైనం విస్మయానికి గురి చేస్తోంది.ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ ను కొంతకాలంగా ఒక యువకుడు వేధిస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. అతడి పేరు శ్రీకాంత్ గా ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. షాకింగ్ అంశం ఏమంటే.. ఈ శ్రీకాంత్ అనే పోకిరి.. గతంలోనూ ఆమెను ఇబ్బందులకు గురి చేసేవాడు.

దీంతో.. విసిగిపోయిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడ్ని అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చి పంపినట్లుగా చెబుతున్నారు.

పోలీసులు ఒకసారి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా అతగాడు తన తీరును మార్చుకోకపోవటం.. అతగాడి వేధింపులను భరించలేని ఆమె తప్పనిసరి పరిస్థితుల్లో మరోసారి పోలీసుల్ని ఆశ్రయించాల్సి వచ్చింది.

నైనాను ఇన్ స్టా వేదికగా చేసుకొని వేధిస్తున్నట్లుగా తాజాగా ఆమె తండ్రి అశ్విన్ జైశ్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో ఆయన కంప్లైంట్ ను తీసుకున్న పోలీసులు సైబర్ నేరం కింద కేసు బుక్ చేసిన విచారణ జరుపుతున్నారు.కాసింత స్ట్రాంగ్ గా ట్రీట్ మెంట్ ఇస్తే తప్పించి.. సదరు కుర్రాడు దారికి వచ్చేట్లుగా లేదన్న మాట వినిపిస్తోంది.మరి.. హైదరాబాద్ పోలీసులు ఏం చేస్తారో చూడాలి.