నీరవ్ మోడీ కోసం ప్రత్యేక జైలు.. పలు సౌకర్యాలు కూడా!

Fri Feb 26 2021 19:39:16 GMT+0530 (IST)

Special jail for Nirav Modi

దేశంలోని పలు బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ కోసం ప్రత్యేక జైలును సిద్ధం చేస్తున్నారు ముంబై పోలీసులు. పీఎన్‌బీ సహా పలు బ్యాంకులను బురిడీ కొట్టించి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టాడు. ఆ తర్వాత మోసం బయటపడడంతో బ్రిటన్ పారిపోయాడు నీరవ్ మోడీ.నీరవ్ దేశం విడిచిపోయినప్పటి నుంచి.. అతన్ని తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంది. ఈ క్రమంలో అక్కడి పోలీసులు అతన్ని అరెస్టు చేసి బ్రిటన్ కోర్టుకు తరలించారు. కేసు విచారించిన అక్కడి కోర్టు.. భారత్ కు నీరవ్ సమాధానం చెప్పాల్సిందేనని తీర్పు చెప్పింది.

ఈ క్రమంలో.. త్వరలో నీరవ్ మోడీని భారత్ కు తరలించడం తథ్యమని తేలిపోయింది. దీంతో.. నీరవ్ కోసం ముంబైలోని ఆర్థర్ రోడ్డులో ఉన్న జైలును అధికారులు సిద్ధం చేస్తున్నారు. అబేధ్యమైన రక్షణతోపాటు పలు సౌకర్యాలు ఉండే బ్యారక్ నెంబర్ 12లో నీరవ్ మోడీని ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు వెల్లడించారు.