Begin typing your search above and press return to search.

రాజుగారికి ఎంత క‌ష్ట‌మొచ్చింది.. తీర్చేవారేరీ?

By:  Tupaki Desk   |   26 Sep 2021 8:51 AM GMT
రాజుగారికి ఎంత క‌ష్ట‌మొచ్చింది.. తీర్చేవారేరీ?
X
ఏపీ బీజేపీ సార‌ధి.. సోము వీర్రాజుకు ఎక్క‌డా లేని క‌ష్టం వ‌చ్చింది. ఆయ‌న ఫోన్ ఎత్తేందుకు కూడా ఆలోచిస్తున్నార‌ట‌! ఆశ్చ‌ర్యం గా అనిపించినా.. ఇదినిజ‌మేన‌ని బీజేపీలో గుస‌గుస జోరుగానే సాగుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌ధాన మంత్రి మోడీ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క రించుకుని నిర్వ‌హిస్తున్న `సేవా స‌మ‌ర్ప‌ణ్‌` కార్య‌క్ర‌మంలో సోము తీరిక లేకుండా ఉన్న‌ప్ప‌టికీ.. మ‌రోవైపు... ఆయ‌న‌కు వ‌స్తు న్న ఫోన్లు.. ప్ర‌స్తుత బీజేపీ ప‌రిస్థితిపై జ‌రుగుతున్న చ‌ర్చ‌లు మాత్రం తీవ్ర సంక‌టంగా మారాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎక్క‌డికి వెళ్లినా.. ఒక‌ప్పుడు రాజుగారికి రెడ్ కార్పెట్ స్వాగ‌తాలు ల‌భించాయి. దీనిలో సందేహం లేదు.

అయితే.. ఇప్పుడు మాత్రం ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా.. సీనియ‌ర్లే ఆయ‌న‌ను అదోర‌కంగా చూస్తున్నార‌ట‌! అదేంటి? అనుకుంటు న్నారా? ఇది నిజ‌మే. ఇదంతా.. సోము ఆధ్వ‌ర్యంలోని బీజేపీ పార్టీ.. అన్ని ఎన్నిక‌ల్లోనూ చ‌తికిలప‌డినందుకు కాద‌ట‌!(సోము ఆధ్వ‌ర్యంలో గ‌త ఏడాది పంచాయ‌తీ ఎన్నిక‌లు,ఈ ఏడాది స్థానిక‌, కార్పొరేష‌న్, ప‌రిష‌త్‌, తిరుప‌తి పార్ల‌మెంటుఉప ఎన్నిక జ‌రిగా యి) మ‌రి విష‌యం ఏంటంటే.. బీజేపీతో పొత్తులో ఉన్న జ‌న‌సేన.. పోయిపోయి.. త‌మ‌కు బ‌ద్ధ శ‌త్రువైన‌.. టీడీపీతో స‌ర్దుబా టు చేసుకోవ‌డంపైనా.. అనేక విష‌యాల్లో ఫైర్ బ్రాండ్ మాదిరిగా రెచ్చిపోయే.. సోము వీర్రాజు.. ఈ విష‌యంలో సైలెంట్ కావ‌డం పైనా.. సీనియ‌ర్లు.. గుర్రుగా ఉన్నారు.

దీంతో ఇప్పుడు సోము ఎక్క‌డికి వెళ్లినా.. సీనియ‌ర్ల చూపుల‌ను ఆయ‌న భ‌రించ‌లేక పోతున్నార‌ట‌. నిజ‌మే.. ప్ర‌స్తుతం బీజేపీతోనే తాము ఉన్నామ‌ని.. సాక్షాత్తూ.. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు రోజుల కిందట కూడా ప్ర‌క‌టించారు. మ‌రి అలాంటి స‌మయంలో ఆచంట‌, దుగ్గిరాల వంటి మండ‌లాల్లో టీడీపీతో ఎందుకు చేతులు క‌లుపుతున్న‌ట్టు? మ‌రో ప‌క్క‌.. కొన్ని వ‌ర్గాల మీడియాలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన.. బీజేపీతో క‌టీఫ్ చెబుతుంద‌ని.. టీడీపీ నేత‌లు.. క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త‌లు కూడా జ‌న‌సేన‌తో క‌లిసి ముందుకు న‌డ‌వాల‌ని కోరుకుంటున్నార‌ని.. పెద్ద ఎత్తున క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

దీనిని టీడీపీ నాయ‌కులు.. కానీ, పార్టీ అధినేత కానీ.. ఖండించ‌లేదు. పోనీ.. జ‌న‌సేన త‌ర‌ఫున అనేక మంది సీనియ‌ర్లు ఉన్నారు. వారైనా ఖండించారా? అంటే అది కూడా లేదు. ఈ ప‌రిణామం.. సోము మెడ‌కు చుట్టుకుంది! ఇప్ప‌టి నుంచి టీడీపీ-జ‌న‌సేన సైలెంట్‌గా చేతులు క‌లిపితే.. మున్ముందు ఇది బ‌లోపేత‌మైతే.. మ‌నం జ‌న‌సేన‌తో ఉండి ఉద్ధ‌రించేది ఏంటి? అని.. సీనియ‌ర్లు బాహాటంగానే చ‌ర్చించుకుంటున్నారు. ముందుగానే మ‌నం మేల్కొని మ‌న ప్ర‌య‌త్నం ఏదో మ‌నం చేసుకుందాం.. జ‌న‌సేన‌తో పొత్తు ఎందుకు? ఇప్పుడే క‌టీఫ్ చెప్పేస్తే.. మ‌న వాయిస్ మ‌నం వినిపించుకునే అవ‌కాశం ఉంటుంది క‌దా? అంటున్నారు.

అయితే.. ఎవ‌రూ కూడా బ‌య‌ట ప‌డ‌డం లేదు. అంద‌రూ క‌ళ్ల‌తోనూ.. హావ‌భావాల‌తోనూ సోమును ప్ర‌శ్నిస్తున్నారు. దీనిపై సోము నోరు విప్ప‌లేక పోతున్నారు. మ‌న‌సులో మాత్రం తీవ్ర ఆవేద‌న ఉన్నా.. ప‌వ‌న్‌కు కేంద్రంలోని బీజేపీ నేత‌ల ద‌గ్గ‌ర ఉన్న లాబీయింగ్ త‌న‌కు లేక‌పోవ‌డం.. త‌న‌ను బాధిస్తోంది. దీంతో ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. మొత్తానికి ఈ ప‌రిణామాల‌ను చూస్తున్న వారు..సోముకు ఎంత క‌ష్ట‌మొచ్చింది?! అనే కామెంట్లు మాత్రం కుమ్మ‌రిస్తున్నారు.