Begin typing your search above and press return to search.

సోష‌ల్ మీడియా స్పీక్స్ : జ‌గ‌న్ క‌థ‌కు మెయిన్ విల‌న్లు వీరే !

By:  Tupaki Desk   |   17 May 2022 4:30 PM GMT
సోష‌ల్ మీడియా స్పీక్స్ : జ‌గ‌న్ క‌థ‌కు మెయిన్ విల‌న్లు వీరే !
X
ఆంధ్రావ‌ని వాకిట వైసీపీ మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ మాట్లాడే మాట‌లే వివాదాల‌కు తావిస్తున్నాయి. కొన్ని సార్లు త‌మ త‌ప్పు దిద్దుకున్న దాఖలాలు ఉన్నా కూడా అవి ఆ క్ష‌ణాల‌కే ప‌రిమితం అవుతున్నాయి. గతంలో వివాదాల‌కు తావిచ్చే విధంగా ఉన్న ఆ ఇద్ద‌రు నాయ‌కులు (ఒక‌రు తాజా మంత్రి అంబ‌టి రాంబాబు, మ‌రొక‌రు మాజీ మంత్రి అవంతి శ్రీ‌నివాస‌రావు) లో ఎవ‌రూ ఎందులోనూ త‌గ్గ‌రు అన్న విధంగా ప్ర‌వ‌ర్తిస్తూ త‌రుచూ వివాదాల‌కు ఆజ్యం పోస్తున్నారు. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు త‌రుచూ వివాదాల‌ను ప‌రిష్క‌రించేందుకు ప్రాధాన్యం ఇవ్వ‌లేక స‌త‌మ‌తం అవుతోంది.

ముఖ్యంగా నీటి పారుద‌ల శాఖ‌కు బాధ్య‌త‌లు అందుకున్నాక అంబ‌టి రాంబాబు ఏం మాట్లాడుతున్నారో అన్న‌ది చూస్తున్నాం. ఆయ‌న మాట‌లే కాకుండా కొన్ని కీల‌క సంద‌ర్భాల్లో న‌డుచుకుంటున్న తీరు, విలేక‌రులను తిరిగి ప్ర‌శ్నిస్తూ హేళ‌న చేస్తున్న ప‌ద్ధ‌తీ ఇవ్వ‌న్నీ వివాదాల‌కు ఆజ్యం పోసేవే!

ఇదే సంద‌ర్భంలో ప్రాజెక్టుల‌కు సంబంధించి ఆయ‌న క‌నీస అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతున్నారు. మ‌రోవైపు ఆయ‌న గురించి కొన్ని కీలక కామెంట్లు ట్వీట్ల రూపంలో చేస్తూ అయ్య‌న్న వివాదాల‌ను పెంచుతూ పోతున్నారు. వాటిని నిలువ‌రించే క్ర‌మంలో వైసీపీ త‌రుచూ తడ‌బ‌డుతోంది.

ఇక మంత్రుల క‌న్నా జిల్లా పార్టీ ఇంఛార్జులే గొప్ప అని ! ఆ మ‌ధ్య సీఎం ఓ డిక్ల‌రేష‌న్ ఇచ్చేశారు. దాంతో జిల్లాల ఇంఛార్జులు క్షేత్ర స్థాయిలో మంత్రుల క‌న్నా ఎక్కువ హ‌వా సృష్టించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. తాజాగా అవంతి శ్రీ‌ను ఉదంత‌మే ఇందుకు ఉదాహ‌ర‌ణ. విశాఖ జిల్లా, ప‌ద్మ‌నాభ మండ‌లం, కోరాడ‌లో ఏర్పాటు చేసిన నాలుగో విడ‌త రైతు భ‌రోసా పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే అవంతి శ్రీ‌ను న‌డ‌వ‌డిక మ‌ళ్లీ వివాదాలకు తావిస్తోంది.

ఈయ‌న గతంలో కూడా ఆడియో టేపుల రూపంలో దొరికి పోయారు. వీళ్లే కాకుండా నోటి దురుసుతో ప్ర‌వ‌ర్తిస్తున్న వారిలో కొడాలి నాని గురించి కానీ పేర్ని నాని గురించి కానీ రోజా సెల్వమ‌ణి గురించి కానీ ఇంకా చెప్పాలంటే ఈ జాబితా చాలా పెద్ద‌దే ఉంది.

ప‌ద‌వి ఉంద‌న్న ధీమాతో వీరు న‌డుచుకుంటున్న తీరే ఓ విధంగా కార‌ణం అనుకుంటే, మాజీ మంత్రులు సైతం మంత్రుల‌కు ఏ పాటి తీసిపోం అన్న విధంగా ప్ర‌వ‌ర్తించి వివాదాల‌కు తావిస్తూ జ‌గ‌న్ క‌థ‌కు విల‌న్లు అవుతున్నారు.