ఎయిర్ అంబులెన్సులో జపాన్ నుంచి గుజరాత్ కు సోషల్ మీడియా ఎఫెక్ట్

Thu Jun 10 2021 10:41:25 GMT+0530 (IST)

Social Media Effect on Air Ambulance from Japan to Gujarat

ఎవరెన్నిచెప్పినా ఇవాల్టి రోజున నెటిజన్లు మహా బలవంతులు.. శక్తివంతులు అనటంలో సందేహం లేదు. వారు రియాక్టు కావాలే కానీ రాత్రికి రాత్రి ఓవర్ నైట్ స్టార్ కావొచ్చు.. సెలబ్రిటీ కావొచ్చు. అదే సమయంలో హీరో కాస్తా జీరో కావొచ్చు. అంతా నెటిజన్ల చలువ అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మిగిలిన ప్రపంచంలోని వారికి కాస్త భిన్నంగా నెటిజన్ల ఉంటారు. తమకు ఏమీ కాకున్నా.. తమకు ఎలాంటి సంబంధం లేకున్నా.. ఎక్కడో సదూర ప్రాంతంలోని వారు చేసే విన్నపాలకు స్పందిస్తారు. మద్దతు ఇస్తారు. అన్నింటికి మించిన అనూహ్య రీతిలో ఆర్థిక సాయాన్ని ఇచ్చేందుకు వెనుకాడరు. తాజా ఉదంతమే ఇందుకు నిదర్శనం.గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన ఒక వ్యక్తి విషయంలో వారు చూపించిన పెద్ద మనసు.. సదూరా ఉన్న అతను సొంతూరుకు చేరుకోగలిగాడు. వైద్యం చేయించుకుంటూ త్వరలో మామూలుగా మారనున్నట్లుగా చెబుతున్నారు. గుజరాత్ కు చెందిన 33 ఏళ్ల జయేశ్ ఉద్యోగం కోసం జపాన్ కు వెళ్లాడు. భార్య ప్రెగ్నంట్ కావటంతో భారత్ వచ్చేసింది. సమయం చూసుకొని స్వదేశానికి వద్దామని అనుకున్నంతలో.. గత ఏడాది అక్టోబరులో టీవీ సోకింది. అనంతరం బ్రెయిన్ స్ట్రోక్ రావటంతో అతడ్ని ఓటా నగరంలోని ఆసుపత్రిలో చేర్చారు.

ఎనిమిది నెలలుగా చికిత్స పొందుతున్నాడు. అతడికి సాయంగా ఉండేందుకు అతడి తండ్రి సైతం జపాన్ వెళ్లాడు. జపాన్ నుంచి గుజరాత్ కు తీసుకొచ్చి వైద్యం చేయాలని అనుకున్నారు కానీ.. అందుకు అవసరమయ్యే రూ.1.2 కోట్ల ఖర్చును భరించే ఆర్థిక స్థితి వారికి లేదు. దీంతో.. అతని స్నేహితులు ‘‘ఐ సపోర్టు జయేశ్ పటేల్’’ పేరుతో ఫండ్ రైజింగ్ చేపట్టారు. దీనికి నెటిజన్లు స్పందించారు. తమ వంతుగా విరాళాలు ఇచ్చారు. దీంతో.. వచ్చిన డబ్బులు.. ఇతరులు ఇచ్చిన సాయంతో రెండు దేశాల ప్రత్యేకత అనుమతితో ఎయిర్ అంబులెన్సులో తాజాగా అహ్మదాబాద్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం జయేశ్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనతో ఉన్నా.. సొంతూరు చేరిన నేపథ్యంలో కోలుకుంటాడని భావిస్తున్నారు. అంతా మంచి జరగాలని కోరుకుందాం. ఏమైనా.. నెటిజన్ల శక్తిసామర్థ్యాలు ఏ పాటివన్న విషయం తాజా ఉదంతం మరోసారి ఫ్రూవ్ చేసిందని చెప్పాలి.