పిల్లలు ఆడాళ్లను వేధించిన గాయకుడికి 30ఏళ్లు జైలు!

Fri Jul 01 2022 08:00:01 GMT+0530 (IST)

Singer R Kelly Jailed For 30 Years Over Sex Crimes

అతడు పిల్లలు ఆడాళ్లను వేధించాడు. లైంగికంగా కోరికలు తీర్చుకున్నాడు. ఆ తర్వాత పోర్నోగ్రఫీ కి వీడియోలను విక్రయిస్తాడు. అతడి రాసలీలలు అన్నీ ఇన్నీ కావు. అతడి వేధింపుల ప్రహసనంతో ఎందరో జీవితాలను కోల్పోయారు. అతడు ఒక ప్రముఖ సింగర్ కావడంతో ఇండస్ట్రీలో గొప్ప ఫాలోయింగ్ ఉంది. కానీ దానిని అతడు దుర్వినియోగం చేసాడు. తన సెక్స్ లైఫ్ ఎంజాయ్ మెంట్ కోసం ఎందరినో వేధించాడు. ఇప్పుడు అతడు వేధింపులు.. సెక్స్ ట్రాఫికింగ్ కేసులో ఇరుక్కుని జైలు పాలయ్యాడు. ఏకంగా 30 ఏళ్ల పాటు జైలును కోర్టు విధించింది.సెక్స్ ట్రాఫికింగ్ కేసులో గత ఏడాది దోషిగా తేలిన హాలీవుడ్ సింగర్ ఆర్.కెల్లీకి న్యూయార్క్ కోర్టు బుధవారం నాడు 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్.కెల్లి అమెరికన్ సింగర్.. రచయిత.. నిర్మాత. గ్రామీ అవార్డుకి నామినేట్ అయిన అతడు మైఖేల్ జాక్సన్ యు ఆర్ నాట్ ఎలోన్ సింగిల లోనూ కనిపించాడు. అతడు ఇప్పుడు వేధింపుల కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. మహిళలు పిల్లలను లైంగికంగా వేధించినందుకు కెల్లీని తాజా కోర్టు తీర్పు శంకరమాన్యాలు పట్టించింది. ప్రఖ్యాత వెరైటీ కథనం ప్రకారం.. 55 ఏళ్ల R&B గాయకుడు సెక్స్ ర్యాకెట్ ని నడిపిస్తున్నాడనేది ప్రధాన అభియోగం. వ్యభిచారం కోసం రాష్ట్ర సరిహద్దుల గుండా ప్రజలను రవాణా చేయడాన్ని నిషేధించే `మాన్` చట్టాన్ని ఎనిమిది సార్లు ఉల్లంఘించాడు. అతను జూలై 2019 నుండి జైలులో ఉన్నాడు. ప్రభుత్వం తరపున 45 మంది సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. అతను ఇప్పటికీ చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో చికాగోలో న్యాయపరమైన ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అలాగే ఇల్లినాయిస్ .. మిన్నెసోటాలోని రాష్ట్ర న్యాయస్థానాలలో రకరకాల అభియోగాలను ఎదుర్కొంటున్నాడు.

అతని ఆగడాలపై కొంతమంది మహిళలు ఎదురు తిరిగారు. బలంగా నిలబడ్డారు. కోర్టుల్లో పోరాడారు. అలా ధైర్యంగా ఎదురు నిలిచిన మొదటి బాధితురాలు ఏంజెలా. అతడి ఆగడాలకు బాధితురాలిగా మొండి ధైర్యంతో పోరాడిన తొలి మహిళ ఆమె. గాయకుడిగా పాపులారిటీని అడ్డు పెట్టుకుని ధనబలం అండదండలతో అతడు పిల్లలను ఆకర్షించే పైడ్ పైపర్ అంటూ ఆమె ఆరోపించింది. ``అతడు దుష్టత్వంతో పెరిగాడు. తన లైంగిక తృప్తి కోసం తక్కువ వయస్సు గల అబ్బాయిలు బాలికలను పెళ్లి చేసుకునేందుకు.. దీనిలో శిక్షణ ఇవ్వడానికి అతడు తన కీర్తిని శక్తిని ఉపయోగించాడు`` అని తెలిపింది. మనం ఒకప్పటిలా వేటాడే వ్యక్తులం కాదు. మీ ఆత్మ ఆ భగవంతుడి వద్దకు చేరాలని ప్రార్థిస్తాను`` అని ఆమె అన్నారు. రెండవ బాధితురాలు అడీ ఏమన్నారంటే... కెల్లీతో 1990ల నాటి అనుభవం గురించి దశాబ్దాలుగా మౌనంగా ఉన్నందుకు చింతిస్తున్నానని చెప్పింది. ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా నా మౌనం ఇతరులను ఎలా బాధపెట్టిందో తెలిసింది.. అని ఆవేదన వ్యక్తం చేసింది. లిజెట్ మార్టినెజ్ తన ఇంపాక్ట్ స్టేట్ మెంట్ లో ఇలా చెప్పింది..``నేను అనుభవించిన వాటికి ఎలాంటి ధర పెట్టాలో నాకు తెలియదు. నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు.. ఒక తల్లిని. నేను మానసిక అనారోగ్యంతో పోరాడుతున్నాను`` అని తెలిపింది. అతడు చాలా మంది జీవితాలను నాశనం చేసాడు అని మరో బాధితురాలు చెప్పింది. జేన్ డో నం. 2 గా గుర్తింపు ఉన్న వేరొకరు.. అతడు జీవితాంతం జైలుకు వెళ్లాలని  ఆశిస్తున్నాను అని అన్నారు.

55 ఏళ్ల కెల్లీకి 25 ఏళ్లకు పైగా జైలు శిక్ష విధించాలని ప్రాసిక్యూటర్లు న్యాయమూర్తిని కోరారు. అయితే అతని డిఫెన్స్ న్యాయవాదులు 10 లేదా అంతకంటే తక్కువ సంవత్సరాలు శిక్ష విధించాలని అడిగారు. ప్రాసిక్యూటర్ల అభ్యర్థన `జీవిత ఖైదుతో సమానం` అని అన్నారు.

గాయకుడు కెల్లీ మొత్తం తొమ్మిది కేసుల్లో దోషి అని తేలింది. గత  సెప్టెంబరులో ఆరు వారాల విచారణ లో చాలా విషయాలు నిగ్గు తేలాయి. అతను అభిమానులను.. ఆశతో వచ్చే గాయనీగాయకులను లైంగికంగా దుర్వినియోగం చేయడానికి అలాగే ఎదుటివారిని నియంత్రించే పరిస్థితులను క్రియేట్ చేస్తూ పిల్లలు మహిళలను ఆకర్షించడానికి ఉద్యోగులను మధ్యవర్తులను ఎలా ఉపయోగించాడో వెల్లడించారు. నల్ల కళ్లద్దాలు ఖాకీ చొక్కా ధరించిన కెల్లీ విచారణ సమయంలో ఎక్కువగా తల దించుకుని ఉండేవాడని.. అప్పుడప్పుడు జడ్జి లేదా సాక్షి వైపు చూసేవాడని ఒక కథనం వెల్లడించింది.

సెలబ్రిటీ కెల్లీ సెక్స్ ను ఆయుధంగా ఉపయోగించుకున్నాడని తన బాధితులతో చెప్పలేని పనులు చేయమని బలవంతం చేశాడని.. కొందరిని లైంగికంగా సంక్రమించే వ్యాధులకు గురి చేశాడని యుఎస్ జిల్లా జడ్జి ఆన్ డోనెల్లీ చెప్పారు. ప్రేమ బానిసత్వం హింస అని కెల్లీ తన శిష్యగణంలో ఔత్సాహికులకు బోధించాడని జడ్జి చెప్పారు. రెండు దశాబ్దాలుగా మహిళలు పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేసేందుకు కెల్లీ తన ఛరిష్మాను ఎలా ఉపయోగించారో కోర్టు విచారించింది. శిక్ష తర్వాత కెల్లీ చికాగో జైలుకు బదిలీ చేసేందుకు ఆస్కారం ఉంది. అక్కడ అతను పిల్లల అశ్లీలత వేధింపుల ఆరోపణలపై ఆగస్టులో విచారణను ఎదుర్కొంటాడు.