'రేపిస్టుల పై' సింగర్ చిన్మయి సంచలన ట్వీట్స్

Sun Jan 16 2022 15:45:10 GMT+0530 (IST)

Singer Chinmayi's sensational tweets

ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద మరోసారి సంచలన  ట్వీట్లు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన సింగర్ చిన్మయి ఎలాంటి అంశంపైనైనా ధైర్యంగా స్పందిస్తుంటుంది. ముఖ్యంగా ‘మీటూ’ లైంగిక ఆరోపణలపై చిన్మయి చేసిన ఆరోపణలు తమిళ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాయి. అయితే అంతే స్థాయిలో వివాదాలు చెలరేగాయి. సినీ అవకాశాల కోసం అన్నీ భరిస్తూ నోర్మూసుకునే తత్త్వం తనది కాదని నిరూపించుకుంది. నిర్మోహమాటంగా.. ధైర్యంగా సోషల్ మీడియాలో చెబుతుంటుంది.తాజాగా మరోసారి తన ట్వీట్ బాణాన్ని చిన్మయి సంధించింది. సమాజంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. తాజా ట్వీట్ వైరల్ అవుతోంది. ‘సమాజం రేపిస్టులను మాత్రమే ప్రేమిస్తోందంటూ’ చిన్మయి చేసిన తీవ్ర వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

2017లో కేరళలో జరిగిన ఓ ఘటనకు సంబంధించి పలువురు సినీ సెలబ్రెటీలు గళం ఎత్తారు. నటి కిడ్నాప్ అత్యాచార వేధింపుల కేసులో హీరో దిలీప్ కుమార్ జైలుకు వెళ్లాడు. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చాడు.

ఇక హీరో దిలీప్ కు వ్యతిరేకంగా మలయాళ ప్రముఖ నటి పార్వతి తిరువోత్ మహిళా సంఘాలతో కలిసి బాధిత హీరోయిన్ కు మద్దతుగా పోరాటం చేశారు.  అండగా నిలిచారు. అదే ఆమెకు శాపమైంది. తర్వాత ఆమెకు మలయాళ ఇండస్ట్రీలో సినీ అవకాశాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆమె వాపోయింది. తాను హీరోయిన్ కు మద్దతుగా నిలవడమే తప్పా? అని.. తనకు ఎందుకు సినిమా అవకాశాలు ఇవ్వడం లేదని ఆమె తాజాగా వాపోయింది.

పార్వతి ఆవేదనపై సింగర్ చిన్మయి ట్విట్టర్ వేదికగా సమాజాన్ని తిట్టిపోశారు. ‘నిజం మాట్లాడిన పార్వతి వంటి మంచి నటిని ఇండస్ట్రీ కోల్పోయింది. లైంగిక వేధింపులు చేసిన వారు బాగానే ఉన్నారు. వారిపై మాట్లాడితే పని కోల్పోయేలా చేస్తారా? చాలా మంది మహిళలు మౌనంగా ఉన్నారు. రేపిస్టులను మాత్రమే ఈ సమాజం ప్రేమిస్తోంది’ అని చిన్మయి హాట్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.