Begin typing your search above and press return to search.

ఎన్నికల బరిలో మరోసారి సింధు

By:  Tupaki Desk   |   24 Nov 2021 12:30 PM GMT
ఎన్నికల బరిలో మరోసారి సింధు
X
భారత స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(బీడబ్ల్యూఎఫ్‌) అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో పోటీపడనుంది. ఈ ఎన్నికలు స్పెయిన్‌ లో డిసెంబరు 17న జరుగుతాయి. అథ్లెట్స్‌ కమిషన్‌లో ఆరు స్థానాలు ఉండగా 9 మంది క్రీడాకారుల్ని పోటీపడనున్నారు. అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యులు 2021 నుంచి 2025 వరకు పదవిలో కొనసాగుతారు.

ప్రస్తుతం అథ్లెట్స్‌ కమిషన్‌ సభ్యురాలిగా ఉన్న సింధు మరోసారి ఎన్నికల్లో బరిలోకి దిగుతుంది. 2017లో తొలిసారిగా సింధు అథ్లెట్స్‌ కమిషన్‌ కు ఎంపికైంది. ప్రస్తుత అథ్లెట్స్‌ కమిషన్‌ నుంచి సింధు ఒక్కరే మరోసారి ఎన్నికల్లో బరిలో దిగుతుంది.

ఈ అథ్లెట్స్ కమిషన్ 2021 నుంచి 2025 వరకు అమల్లో ఉంటుంది. రీ ఎలక్షన్ కోసం పోటీ పడుతున్న ఏకైక క్రీడాకారిణి పీవీ సింధూనేనని బీడబ్ల్యూఎఫ్ ప్రకటించింది. అంతకుముందు 2017లో పీవీ సింధు తొలిసారి అథ్లెట్స్ కమిషన్ సభ్యురాలిగా ఎన్నికైంది. సింధుతో పాటు ఇండోనేషియా విమెన్స్ డబుల్స్ ప్లేయర్ గ్రేషియా పొలీలి కూడా పోటీలో ఉంది.

అథ్లెట్స్‌ కమిషన్‌ కు ఎంపికైన సభ్యులు ఛైర్మన్‌ను ఎన్నుకుంటారు. అనంతరం అథ్లెట్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌ను బీడబ్ల్యూఎఫ్‌ కౌన్సిల్‌ లోకి తీసుకుంటారు.

సింధుతో పాటు గ్రేసియా పోలి (ఇండోనేసియా), ఆడమ్‌ హాల్‌ (స్కాట్లాండ్‌), హదియా హోస్నీ (ఈజిప్ట్‌), ఐరిస్‌ వాంగ్‌ (అమెరికా), కిమ్‌ సోయెంగ్‌ (కొరియా), రాబిన్‌ టేబిలింగ్‌ (నెదర్లాండ్స్‌), సొరాయ (ఇరాన్‌), జెంగ్‌ వీ (చైనా)లు అథ్లెట్స్‌ కమిషన్‌ ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. ఇక అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐవోసీ) బిలీవ్‌ ఇన్‌ స్పోర్ట్స్‌ కార్యక్రమానికి ప్రచారకర్త గా నియమితులయ్యే వారిలో సింధు పేరు కూడా ఉంది.