Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్ కోసం లక్షల్లో షార్క్ లు బలి కావాల్సిందేనా !

By:  Tupaki Desk   |   17 Oct 2020 4:00 PM GMT
వ్యాక్సిన్ కోసం లక్షల్లో షార్క్ లు బలి కావాల్సిందేనా !
X
ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తున్నారు. అయితే ఈ వ్యాక్సిన్‌ తయారీ కోసం లక్షల సంఖ్యలో షార్క్‌లు బలికావల్సి వస్తుందని షార్క్‌ పరిరక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ తయారీలో షార్క్ చేపల షార్క్‌ చేపల కాలేయం నుంచి తీసే నూనెను వినియోగిస్తున్నారు. స్క్వాలిన్‌ పేరుతో పిలిచే ఈ నూనె రోగ నిరోధక శక్తి పెంచడం లో కీలక పాత్ర పోషిస్తున్నది. అందుకోసమే షార్క్‌ చేపల కాలేయ వినియోగం పెరిగినట్లు కాలిఫోర్నియా కేంద్రంగా పని చేసే ఓ టీకా తయారీ సంస్థ తెలిపింది. ఇప్పటికే ఈ స్వ్కాలిన్‌ను బ్రిటన్‌కు చెందిన ఫార్మాసూటికల్‌ కంపెనీ ఫ్లూ వ్యాక్సిన్‌ల తయారీలో వాడుతున్నది.

ఇప్పటికే, ప్రపంచవ్యాప్తంగా 193 రకాల కరోనా వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సం‍స్థ తెలిపింది. వీటిలో ఐదు, ఆరు కంపెనీలు కరోనా వ్యాక్సిన్‌ తయారీలో షార్క్‌ ఆయిల్‌ ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. ఇక బ్రిటన్‌ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్‌ను అందించడానికి 100 కోట్ల డోస్‌ లు తయారు చేయాలని యోచిస్తోంది. ఇక ఒక్కొక్కరికి ఒక్కో డోస్‌ ఇచ్చిన ఇందుకోసం 25 లక్షల షార్క్‌లను చంపాల్సి ఉంటుంది.

అదే ఒక్కొక్కరికి రెండు డోస్‌లు కావాల్సి వస్తే వీటి సంఖ్య రెట్టింపు అయ్యి 50 లక్షలకు పైనే ఉంటుంది. దీని గురించి షార్క్‌ పరిరక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే షార్క్‌ల మనుగడకే ముప్పు వాటిల్లవచ్చని హెచ్చరిస్తున్నారు. షార్క్‌ ఆయిల్‌ బదులు షుగర్‌కేన్‌, గోధుమ, ఈస్ట్‌లు, బ్యాక్టీరియాలు వాడొచ్చని వారు సూచిస్తున్నారు. వీటిపై వ్యాక్సిన్‌ తయారీలో పాల్గొంటున్న నిపుణులు మాట్లాడుతూ, అన్ని రకాల వాటిని పరిశీలించిన తరువాతే షార్క్‌ ఆయిల్‌ను ఉపయోగిస్తామని చెప్తున్నారు. స్క్వాలిన్‌ అధికంగా ఉండే గుల్పర్‌ షార్క్‌, బాస్కింగ్‌ షార్క్‌ ప్రస్తుతం అంతరించే దశలో ఉన్నాయి. అయినా వాటి వేట కొనసాగుతున్నది.