శ్రీకాకుళంలో కాల్పుల కలకలం.. సర్పంచ్ పై కాల్పులు..

Wed Jan 19 2022 10:33:16 GMT+0530 (IST)

Shooting on Sarpanch In Srikakulam

శ్రీకాకుళంలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది.  పాత ఆర్డీవో కార్యాలయం దగ్గర రామచంద్రాపురం సర్పంచ్ వెంకటరమణపై గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బుల్లెట్ వెంకటరమణ పొట్టను రాసుకుంటూ వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పింది. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఘటనా స్థలంలో పోలీసులు రెండు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. మధురానగర్ లోని సర్పంచ్ వెంకటరమణ కార్యాలయానికి ఆదివారంపేటకు ఓ మహిళ రాత్రి వెళ్లింది. ఆమెతోపాటు ఇద్దరు వ్యక్తులు వెంట వెళ్లారు.

 వీరి మధ్య సంభాషణలు జరుగుతుండగా.. ఆమెతో వచ్చిన వ్యక్తులు తుపాకీతో రెండు సార్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారని తెలుస్తోంది. ఆ మహిళ ఎవరు? సర్పంచ్ పై ఎందుకు కాల్పులు జరిపారో పోలీసులు ఆరాతీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ కాల్పుల ఘటనలో మహిళలకు సర్పంచ్ మధ్య సంబంధాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఏ కారణం చేత ఆమె రాత్రి మాట్లాడడానికి వచ్చింది.? సర్పంచ్ తో ఏం పనిమీద వచ్చింది? కాల్పులు జరగడానికి అదే కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది.