Begin typing your search above and press return to search.

మేయర్ ను కాల్చి చంపిన షూటర్స్ ... పక్కాప్లాన్ తో దారుణహత్య !

By:  Tupaki Desk   |   30 July 2021 9:25 AM GMT
మేయర్ ను కాల్చి చంపిన షూటర్స్ ... పక్కాప్లాన్ తో దారుణహత్య !
X
రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతోన్న నాయకుడి మీద ప్రత్యర్థులు పగ పెంచుకున్నారు. మేయర్ గా ఉన్న ఆ నాయకుడిని ఎలాగైనా చంపేయాలని ప్రత్యర్థులు ప్లాన్ వేశారు. మేయర్ ఎక్కడెక్కడికి వెళ్లి వస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అనే విషయాలపై రెక్కీ నిర్వహించారు. సమయం చూసి మేయర్ కి స్పాట్ పెట్టాలని స్కెచ్ వేసిన ప్రత్యర్థులు షార్ప్ షూటర్స్ ను రంగంలోకి దింపారు. ఒకరి గురి తప్పినా మరోకరి గురి తప్పకూడదని ప్లాన్ వేశారు. మీటింగ్ ముగించుకుని ఇంటి సమీపంలో వెలుతున్న మేయర్ మీద షార్ప్ షూటర్ విరుచుకుపడటంతో ఆ రాజకీయ నాయకుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పోలీస్ స్టేషన్ కు అతి సమీపంలో, ఇంటి పక్కనే మేయర్ దారుణ హత్యకి గురికావడం తో స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తోంది.

బీహార్ లోని కథిహార్ నగరం మేయర్ గా శివరాజ్ పాశ్వాన్ హైప్రొ ఫైల్ రాజకీయ నాయకుడు. మేయర్ గా పని చేస్తున్న శివరాజ్ పాశ్వాన్ తో రాజకీయంగా కొందరితో విభేదాలు ఉన్నాయి. హైప్రొఫైల్ రాజకీయ నాయకుడైన శివరాజ్ పాశ్వాన్ మీద ప్రత్యర్థులు పగ పెంచుకున్నారు. మేయర్ శివరాజ్ పాశ్వాన్ ను ఎలాగైన చంపేయాలని ప్రత్యర్థులు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే కాథిహార్ మేయర్ శివరాజ్ పాశ్వాన్ ఎక్కడెక్కడికి వెళ్లి వస్తున్నాడు, ఆయన ఎవరిని కలుస్తున్నాడు, ఏమి చేస్తున్నాడు అంటూ రెక్కీ నిర్వహించారు.

సమయం చూసి మేయర్ శివరాజ్ పాశ్వాన్ ను లేపాయలని స్కెచ్ వేసిన ఆ నాయకుడి ప్రత్యర్థులు షార్ప్ షూటర్స్ ను రంగంలోకి దింపారు. మేయర్ శివరాజ్ పాశ్వాన్ విధులు ముగించుకొని గురువారం రాత్రి కారులో ఇంటికి వస్తుండగా సంతోషి మందిర్ చౌక్ ప్రాంతంలో ఇద్దరు గుర్తుతెలియని దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మేయర్ శివరాజ్ ను హుటాహుటిన కటిహార్ మెడికల్ కాలేజీకి తరలించారు. మూడు బుల్లెట్ గాయాలైన మేయర్ శివరాజ్ మరణించాడని వైద్యులు ప్రకటించారు. కాల్పులు జరిపిన వారికోసం గాలిస్తున్నామని కటిహార్ డీఎస్పీ అమర్ కాంత్ ఝా చెప్పారు.

కథిహార్ పోలీస్ స్టేషన్ కూతవేటు దూరంలో, సంతోషి చౌక్ లోని సొంత ఇంటికి సమీపంలో వెలుతున్న మేయర్ శివరాజ్ పాశ్వాన్ తో సుమారు 38 సంవత్సరాల వ్యక్తి మాట్లాడటానికి ప్రయత్నించాడు. అదే సమయంలో షార్ప్ షూటర్స్ మేయర్ శివరాజ్ పాశ్వాన్ మీద రివాల్వర్ తో కాల్పులు జరిపారు. బుల్లెట్లు దూసుకుపోవడంతో మేయర్ శివరాజ్ పాశ్వాన్ కుప్పకూలిపోయాడు. మేయర్ శివరాజ్ పాశ్వాన్ ను వెంటనే కథిహార్ మెడికాల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మేయర్ శివరాజ్ పాశ్వాన్ ప్రాణాలు పోయాయని వైద్యులు చెప్పారు.

మేయర్ శివరాజ్ పాశ్వాన్ మద్దతుదారులు గుమికూడటంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. మేయర్ శివరాజ్ పాశ్వాన్ ను హత్య చేసిన నిందితులు పారిపోకుండా జిల్లా సరిహద్దులు మూసివేసిన పోలీసులు సోదాలు చేస్తున్నారు. అయితే మేయర్ శివరాజ్ పాశ్వన్ హత్య కేసులో ఇంత వరకు ఎవ్వరిని అరెస్టు చెయ్యలేదని పోలీసు అధికారులు అంటున్నారు