షాకింగ్ నిజం: ఆ డాక్టర్ 49 మంది పిల్లలకు తండ్రి! ఎలానంటే?

Mon Sep 28 2020 05:00:01 GMT+0530 (IST)

Shocking truth: That doctor is the father of 49 children! How?

ఒక డాక్టర్ చేయరాని దారుణానికి పాల్పడ్డాడు. కలలో కూడా ఊహించని రీతిలో చేసిన పని ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు..అసలు విషయం తెలిసిన వారంతా లబోదిబో మంటున్నారు. విన్నంతనే ఒళ్లు గగుర్పాటుకు గురి కావటమే కాదు.. ఇలాంటి దారుణాలకు కూడా డాక్టర్లు పాల్పడతారా? అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..నెదర్లాండ్ దేశం తెలుసు కదా? యూరప్ లోని ఈ చిన్న దేశం ఎంతో అందంగా ఉంటుంది. అలా అని.. స్విట్జర్లాండ్ అంత రమణీయంగా ఉండదు. అలా అని మరీ తీసిపోయే దేశం ఎంతమాత్రం కాదు. ఆ దేశంలో రొట్టెర్ డ్యామ్ అనే ప్రాంతంలో ఒక డాక్టర్ నిర్వహించే క్లినిక్ చాలా త్వరగా ఫేమస్ అయ్యింది. జాన్ కర్బాత్ అనే డాక్టర్ నిర్వహించే ఈ క్లీనిక్ లో పిల్లలు పుట్టని పేరెంట్స్ కు ఐవీఎఫ్ విధానంలో పిల్లల్ని పుట్టించే వాడు. మన దగ్గర సంతాన సాఫల్య కేంద్రాలుగా పిలుస్తుంటాం కదా. అలాంటిదే ఇది కూడా.  ఐవీఎఫ్ విధానంలో అతడిచ్చే ట్రీట్ మెంట్ తో.. ఎంతోకాలంగా పిల్లలు పుట్టని వారికి సైతం ఇట్టే పుట్టేస్తారన్న పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నాడు.

అయితే.. సదరు వైద్యుడు డీల్ చేసే కేసులన్ని సక్సెస్ కావటం.. అతని ట్రీట్ మెంట్ తీసుకునే జంటలు వెంటనే గర్భం దాల్చటం.. పండంటి పిల్లల్ని కనటం జరిగేది. సాధారణం కంటే ఎక్కువగా ఉండే సక్సెస్ రేటు చాలామంది వైద్యులకు సందేహం కలిగేలా చేసింది. అతను అనుసరించే విధానం ఏమై ఉంటుందా? అన్న సందేహంతో చెక్ చేశారు.

వారి విచారణలో షాకింగ్ నిజం బయటకు వచ్చింది. అదేమంటే.. తన వద్దకు సంతానం కోసం వచ్చే జంటలకు.. చట్ట విరుద్ధంగా తన స్పెర్మ్  (శుక్రకణాల్ని) మహిళలకు ఉపయోగించేవాడు. దీంతో.. వారంతా తల్లులు అయ్యారు. ఆ డాక్టర్ ట్రీట్ చేసిన పేషెంట్లకు పుట్టిన పిల్లల డీఎన్ఏను చెక్ చేయగా.. ఈ భాగోతం బయటకు వచ్చింది. అయితే.. ఈ నిజం బయటకు వచ్చే సమయానికి సదరు డాక్టర్ చచ్చి బతికిపోయాడని చెప్పాలి. సాధారణంగా ఇలాంటి కేంద్రాల్లో భర్త శుక్రకణాల్ని భార్య అండంతో ఫలధీకరణ చేపడతారు. అందుకు భిన్నంగా చట్టవిరుద్ధంగా అతను తన శుక్రకణాల్ని ఉపయోగించేవాడు.

అతడి సక్సెస్ స్రీకెట్ రివీల్ కావటం ఒక ఎత్తు అయితే.. తమకు పుట్టాడని సంతోషించిన ఎంతోమంది తండ్రులకు గుండెలు పగిలే శోకాన్ని మిగిల్చాడా డాక్టర్. ఇలాంటి వారు ఎంతమంది ఉంటారని లెక్క తీయగా.. 49 మంది తేలారు. వారిలో చాలామంది వయసులో పెద్దవారైపోయి ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా సదరు వైద్యుడు సరదాగా అనే మాటల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. తాను 60 మంది పిల్లల్ని కనాలని భావిస్తున్నట్లు సదరు వైద్యుడు చెప్పేవాడని.. ఆ మాటలకు అర్థం ఇదా? అంటూ వారు షాక్ తింటున్నారు.