మూడేళ్ల తర్వాత గల్ఫ్ నుండి భర్త .. ఐదు నెలల గర్భంతో స్వాగతం చెప్పిన భార్య .. ఆ తర్వాత ఏమైంది ?

Tue Feb 23 2021 05:00:01 GMT+0530 (IST)

Shocking incident in Telangana

వివాహేతర సంబంధాలు .. ఎన్నో కాపురాలని కూల్చేస్తున్నాయి. ఆకర్షణలకి లోనై తప్పటడుగులు వేస్తూ వందేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కట్టుకున్న భర్తలకు మోసం చేస్తున్న కొందరు భార్యల గురించి నమ్మి వెంటొచ్చిన భార్యలను మోసం చేసిన కొందరు భర్తల గురించి వింటూనే ఉన్నాం. ఇంకొందరు హత్యలు చేసి జీవితాల్ని జైలు పాలు చేసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఓ ఘటన వెలుగు చూసింది. భర్త విదేశాలకు వెళ్లగా భార్య పెట్టుకున్న వివాహేతర సంబంధం అనేక సమస్యలకు దారితీసింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే .. నిజామాబాద్ కు చెందిన ఓ వ్యక్తి బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ వెళ్లాడు. అక్కడే మూడేళ్ల పాటు పనిచేసి ఇటీవలే  వచ్చాడు. ఆనందంతో భార్యను కలిశాడు. అయితే రాగానే భార్యే కి కడుపునొప్పి రావడంతో  జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఆమెకు చికిత్స చేసిన డాక్టర్లు అన్ని పరీక్షలు నిర్వహించారు. ‘నీ భార్య ఐదు నెలల గర్భవతి’ అని చెప్పడంతో భర్త కళ్లు బైర్లు కమ్మాయి. నేను ఇక్కడ లేక మూడేళ్లు అవుతుంటే.. గర్భం ఎలా వచ్చిందంటూ భార్యను ప్రశ్నించాడు. భర్త నిలదీయడంతో అసలు విషయం బయటపడింది. భార్య బండారం బట్ట బయలైంది. గత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన సుమన్ అనే వ్యక్తి తనను బెదిరించి లొంగదీసుకున్నాడని భార్య భర్తకు తెలిపింది. అంతటితో ఆగకుండా తనను గర్భవతిని చేశాడని చెప్పింది. అయితే గర్భాన్ని తొలగిస్తే తన భర్తను చంపుతానని సుమన్ బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది. ఈ విషయంపై ఆమె భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో బాధితురాలి ఫిర్యాదుతో సుమన్ పై లైంగిక బెదిరింపుల కేసు నమోదు చేశారు.