Begin typing your search above and press return to search.

మరికొన్ని గంటల్లో పెళ్లి ... వరుడికి షాక్ ఇస్తూ వధువును తీసుకెళ్లిన తాత..అసలు ట్విస్ట్ ఇదే !

By:  Tupaki Desk   |   4 March 2021 6:30 AM GMT
మరికొన్ని గంటల్లో పెళ్లి ... వరుడికి షాక్ ఇస్తూ వధువును తీసుకెళ్లిన తాత..అసలు ట్విస్ట్ ఇదే !
X
పెళ్లి .. ప్రతి ఒక్కరి జీవితంలో ఓ మధురానుభూతి. జీవితంలో ఒకే ఒకసారి జరిగే అతి పెద్ద వేడుక. అయితే , ఈ మధ్య చాలా పెళ్లిళ్లు పీటల మీదకు వచ్చి చివరి క్షణాల్లో ఆగిపోతున్నాయి. వధువు ఇంకో అబ్బాయి ను ప్రేమిస్తుంది అనో , వధువు కనిపించడం లేదు అనో , అలాగే వరుడికి ఈ పెళ్లి ఇష్టం లేదు అనో ఆగిపోయిన ఎన్నో పెళ్లిళ్ల గురించి మనం వినే ఉంటాం. . కానీ తాజాగా ఓ విచిత్ర సంఘటన జరిగింది. పెళ్లి వరుడికి, వధువుకి ఇష్టమే అయినా, తాత ఎంట్రీతో పెళ్లి వేడుకలో ఊహించిన ట్విస్ట్ జరిగింది. కొద్ది గంటల్లో పెళ్లనగా పెళ్లి మండపం నుంచి వధవును ఆ తాత ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్లిపోయాడు. దీనితో తాము ఈ పెళ్లి కోసం లక్షలకు లక్షలు ఖర్చు పెట్టామంటూ పోలీసులను వరుడి కుటుంబ సభ్యులు ఆశ్రయించారు. కానీ ఆ పోలీసులు వారికే షాకిచ్చారు. ఈ పెళ్లి చేసుకోవద్దని చెప్పారు.

అసలేం జరిగిందంటే..వివరాల్లోకి వెళ్తే .. అనంతపురం జిల్లా ఓడీసీ మండలం అచ్చేమియాపల్లికి చెందిన శ్రీరాములు కుమారుడు శ్రీనివాసులుకు పుట్టపర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం నిశ్చయించారు. పెళ్ళికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. పెళ్లికి అయ్యే ఖర్చును తామే భరిస్తామని వరుడి తరపు వారు ఒప్పుకున్నారు. మంగళవారం సాయంత్రానికి వధువరులిద్దరితో సహా వారి కుటుంబసభ్యులు కల్యాణమండపానికి చేరుకున్నారు. అయితే మంగళవారం రాత్రి ఫొటోషూట్ నిర్వహించాలని వరుడు భావించాడు. రాత్రిపూట వధువును మండపంలోకి పిలిచి పక్కపక్కనే నిలబెట్టి ఫొటోలు తీస్తున్నారు. దీంతో సడన్ గా ఆ అమ్మాయి తాత ఎంట్రీ ఇచ్చాడు. ‘పెళ్లి కాకముందే వధూవరులిద్దరిని పక్క పక్కన నిలబెట్టి ఫొటోలు తీయడమేంటి, ఇది అసలు పద్దతేనా, ఇవేం ఆచారాలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయమై వారి మధ్య గొడవే జరిగింది. అయితే బంధువుల జోక్యంతో వివాదం ముగిసింది. ఫొటోల తంతు ఆగిపోయింది.

అయితే వరుడి తరుపు వారి ప్రవర్తన ఆ తాతకు చిరాకు తెప్పించింది. దీంతో కొద్ది గంటల్లో పెళ్లనగా, వదువును బుధవారం తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా తన వాహనంలో సొంతూరికి తీసుకెళ్లిపోయాడు. తెల్లారిన తర్వాత చూస్తే వధువు, ఆమె తాత కనిపించలేదు. ఫోన్ చేస్తే ఊళ్లో ఉన్నా.. పెళ్లిలేదు ఏం లేదు మీరు కూడా వచ్చేయండి అంటూ తాపీగా సమాధానం చెప్పాడు. దీంతో పెళ్లి ఆగిపోయింది. పెళ్లికి మూడు లక్షల వరకుఖర్చు పెట్టుకున్నామనీ ఇదంతా తమకు నష్టమేననీ వరుడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. అయితే సొంత మండలంలో ఫిర్యాదుచేసుకోవాలని పోలీసులు చెప్పడం తో పుట్టపర్తి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వారు వధువు గ్రామానికి వెళ్లి ఆమె బంధువులతో చర్చించారు. అయితే విచారణలో వారికి ఓ నిజం తెలిసింది. ఆ వధువు మైనర్ అని వారికి నిజం తెలిసింది. దీంతో వధువు మైనర్ కావడంతో పెళ్లి చేయొద్దని చెప్పడంతోపాటు, ఇదే విషయమై వరుడి తరపు వారికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు.