కలికాలం కాకుంటే ఏంది? భర్తకు విడాకులు ఇచ్చి మామను పెళ్లాడి..!

Thu Apr 22 2021 09:16:34 GMT+0530 (IST)

Shocking incident in America

కొన్ని నిజాల్ని వినేందుకే ఇష్టపడలేం. ఇక.. జీర్ణించుకోవటం చాలా కష్టంతో కూడుకున్నది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఇదే కోవకు చెందింది. ఇలాంటివి విన్నంతనే కలికాలం కాకుంటే ఏమిటిది? అనుకోవటం ఖాయం. నిజమే.. కలికాలంలోనే ఇలాంటివి చోటు చేసుకుంటాయనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..అమెరికాలోని ఒక యువతి తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. అనంతరం మరో పెళ్లి చేసుకుంది. ఈ మాత్రానికేనా? అన్న ప్రశ్నతో పాటు.. అమెరికాలో ఏంటి ఇండియాలోనూ ఇప్పుడు కామనే కదా? అనుకోవచ్చు. కానీ.. ట్విస్టు ఏమిటంటే.. ఆ పెళ్లాడింది ఎవరినో కాదు.. మామనే. అంటే.. మాజీ భర్త తండ్రినే అన్న మాట.షాకింగ్ గా ఉన్నా ఇది నిజమని చెబుతున్నారు. అంతేనా.. ఇప్పుడు ఈ ముగ్గురు.. మాజీ భార్యతో తనకు లభించిన సంతానంతో కలిపి నలుగురు ఒకే ఇంట్లో ఉండటం మరింత ఆసక్తికరం. ఈ విచిత్రమైన ఉదంతంలోకి వెళితే.. కెంటుకీలో హారోడ్స్బర్గ్ ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల ఎరికాకు.. ఆమెకు పదహారేళ్ల వయసు ఉన్నప్పుడు ఇప్పుడు భర్తగా ఉన్న జెఫ్ తో పరిచయం ఉంది. అతగాడి భార్య మొదటి భర్తకు పుట్టిన అమ్మాయి.. ఎరికా మంచి స్నేహితులు. ఈ క్రమంలో ఎరికాకు జెఫ్ సవతి కుమారుడు జస్టిన్ తో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారటంలో వారు పెళ్లి చేసుకున్నారు.

వారికో బిడ్డ కూడా. వారి వైవాహిక బంధం హ్యాపీగా గడుస్తున్న వేళ.. కలతలు వచ్చాయి. దీంతో వారు విడాకులు తీసుకున్నారు. అనంతరం తన భర్త సవతి తండ్రి జెఫ్ తో ఎరికా ప్రేమలో పడింది. వయసులో తనకంటే 29 ఏల్ల పెద్దవాడు.. ఒకప్పుడు తన మామనే ఆమె పెళ్లాడింది. ఈ విషయాన్ని తొలుత విన్నంతనే విడాకులు ఇచ్చిన భర్త జస్టిన్ నమ్మలేకపోయాడు. కానీ.. ఎరికా చెప్పేయటంతో అంగీకరించాడు. అయితే.. తమకు పుట్టిన బిడ్డను పెంచుకోవటానికి మాజీ భర్తకు ఇచ్చేయటంతో జస్టిన్ ఓకే చెప్పేశాడు.

దీంతో ఒకప్పటి మామకు భార్యగా మారిన ఆమె.. ఒకప్పటి భర్తకు పినతల్లిగా మారిపోయింది. ఈ నలుగురు ఒకే ఇంట్లో ఉంటూ బతికేస్తున్నారు. ప్రస్తుతం తమ మధ్య అంతా బాగుందని.. తన మాజీ భార్య మీద తనకు ఎలాంటి కోపం లేదని.. తనకు నచ్చిన పనే చేసింది కదా అన్న మాజీ భర్త.. ‘ఆమె ఫీలింగ్స్ ను అర్థం చేసుకున్నాను. నా బిడ్డను నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పటం కొసమెరుపు. ఇక.. తన కంటే ఎంతో పెద్దవాడైన ఎక్స్ మామ.. ప్రస్తుతం భర్త హోదాలో ఉన్న ఎరికా.. జీవితాన్నిచాలా హ్యాపీగా గడిపేస్తామని చెప్పింది. విన్నంతనే షాకింగ్ లా ఉండే ఈ ఉదంతాన్ని జీర్ణించుకోవటం మనకు మాత్రం కాస్త కష్టమే.