దారుణం: 25 ఏళ్ల వివాహితపై మైనర్ అత్యాచారం !

Tue Jun 22 2021 22:00:01 GMT+0530 (IST)

Shocking Incident In Odisha

సమాజంలో ప్రతిరోజూ జరిగే కొన్ని సంఘటనలు చూసో లేక సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా పెరగడం వలనో కానీ పసితనంలో చాలామంది పిల్లలు చెడు దారిలోకి వెళ్లిపోతున్నారు. ఇంట్లో అమ్మ నాన్న చెప్పింది విని బాగా తిని బుద్దిగా చదువుకోవాల్సింది పోయి చెడుదారిలో వెళ్తున్నారు. చేయకూడని నేరాలు ఘోరాలు చేస్తు  సభ్యసమాజం విస్తుపోయేలా వ్యవహరిస్తున్నారు. మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ  మైనర్  కుర్రాడు దురాఘాతానికి ఒడిగట్టాడు 25 ఏళ్ల వివాహితపై అత్యాచారం చేశాడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే .. భోపాల్ లోని నజీరాబాద్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 16న మహిళ ఇంట్లోకి చొరబడిన మైనర్ అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. బాధితురాలి భర్త వైకల్యంతో బాధపడుతున్నాడు. ఆమెకు ఓ కూతురు ఉంది. బాధితురాలు జరిగినదంతా కుటుంబసభ్యులకు చెప్పింది. నజీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మైనర్ కు 17ఏళ్లు ఉంటాయి. అతడు మహిళ ఇంటి పక్కనే ఉంటాడు. ఆమెపై కన్నేసిన మైనర్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో దారుణానికి దిగాడని తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. వివాహితను ఓ యువకుడు రేప్ చేశాడు. దాన్ని వీడియో కూడా తీశాడు. ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేస్తూ పలు మార్లు అత్యాచారం చేశాడు. అతడి వేధింపులు తట్టుకోలేకపోయిన బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది.