Begin typing your search above and press return to search.

మసాజ్ పేరు చెప్పి హైదరాబాద్ పిలిపించి ఆరాచకం చేసిన ఫ్రెండ్స్

By:  Tupaki Desk   |   15 May 2022 2:56 AM GMT
మసాజ్ పేరు చెప్పి హైదరాబాద్ పిలిపించి ఆరాచకం చేసిన ఫ్రెండ్స్
X
ఒకరిపై మరొకరికి నమ్మకాలు తగ్గిపోతున్న రోజులవి. బంధాలు.. అనుబంధాలకు సంబంధించి సైతం షాకింగ్ ఉదంతాలు తెర మీదకు వస్తున్న పాడు రోజులివి. ఇలాంటి పరిస్థితుల్లో నమ్మకంతో స్నేహితులు పిలుస్తున్నారని చెప్పి వస్తే.. ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయని చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. హైదరాబాద్ లో వెలుగు చూసిన ఈ వైనం చూస్తే.. ఇవెక్కడి పాడు రోజులురా బాబు.. అనుకోకుండా ఉండలేం.

థెరపీ సేవల కోసం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు పిలిపించిన స్నేహితులు.. తాము చెప్పినట్లుగా వినటం లేదన్న కోపంతో చేసిన పనుల గురించి తెలిస్తే నోటి వెంట మాట రాని పరిస్థితి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతంపై పోలీసులు వెల్లడించిన వివరాల్లోకి వెళితే.. ముంబయికి చెందిన డ్యాన్సర్ కమ్ మసాజ్ థెరపిస్టు బివ్వాస్ కు హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కు చెందిన సంజన స్నేహితురాలు. తనకు తెలిసిన వారికి మసాజ్ చేసేందుకు హైదరాబాద్ వస్తే భారీగా డబ్బులు సంపాదించొచ్చు అన్న మాటతో బిశ్వాస్ ఒప్పుకుంది. అనుకున్న విధంగా ఫైట్ టికెట్ పంపింది సంజన.

ఈ నెల 9న ఢిల్లీ నుంచి బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ తో హైదరాబాద్ కు చేరుకున్న ఆమె.. సంజన ఇంటికి వచ్చింది. పదిన సంజన ఫ్రెండ్స్ కోమటి.. సునీతలు కూడా వచ్చారు. తనకు తెలిసిన వారికి థెరపీ సేవలతో పాటు.. శారీరక సుఖాన్ని అందిస్తే భారీగా డబ్బులు ఇస్తారని చెప్పటంతో బిశ్వాస్ ఓకే చెప్పింది. వారంతా పన్నెండున జూబ్లీహిల్స్ లోని ఓబుల్ రెడ్డి స్కూల్ దగ్గర ఉన్న వారి ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడకు కోమటి.. సునీతలతో పాటు మరో ఐదుగురు పురుషులు ఉన్నారు. చెప్పిన రీతిలో బిశ్వాస్ లేదంటూ ఆమెతో గొడవకు దిగారు. దీంతో డయల్100కు ఫోన్ చేసింది బిశ్వాస్. జూబ్లీహిల్స్ పోలీసులు వచ్చి వారికి సర్ది చెప్పారు.

ముందుగా అనుకున్న విధంగా బిశ్వాస్ చేయటం లేదని సంజనకు మిగిలిన ఇద్దరు (కోమటి.. సునీత) ఫిర్యాదు చేశారు. వీరిమధ్య మొదలైన రగడ అంతకంతకూ పెరిగింది. దీంతో కోపానికి గురైన బిశ్వాస్.. తాను పోలీసులకు కంప్లైంట్ చేస్తామని చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన మిగిలిన ముగ్గురు.. బిశ్వాస్ ఒంటి మీద దుస్తుల్ని బలవంతంగా తొలగించటమే కాదు.. కొట్టి.. పళ్లతో కొరికారు. ఆమె పారిపోకుండా గదిలో బంధించారు. తలపై హెయిర్ డయర్.. ఒంటిపై శానిటైజర్ పోశారు. తనపై జరుగుతున్న దాడి నుంచి తనను తాను రక్షించుకోవటానికి బాత్రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది.

అక్కడ నుంచి బయటపడిన ఆమె.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గురని(సంజన, కోమటి.. సునీత) అదుపులోకి తీసుకొని అనంతరం అరెస్టు చేశారు. ఆపై రిమాండ్ కు తరలించారు. స్నేహితులు.. మంచి ఉద్యోగం లాంటి మాటలకు వెంటనే పడిపోకుండా ఉండాల్సిన అవసరం ఎంతన్న విషయం తాజా ఉదంతం చెబుతుందని చెప్పాలి.