గర్భవతితో అక్రమసంబంధం ..దారుణ హత్య !

Tue Nov 24 2020 14:20:31 GMT+0530 (IST)

Shocking Incident In Gujarat

అక్రమ సంబంధాల వల్ల వచ్చే అనర్దాల గురించి తెలుసుకుంటూ కూడా ఇంకా కొంతమంది ఆ అక్రమ సంబంధాల ముసుగులో ప్రాణాలని కోల్పోతున్నారు. అక్రమ సంబంధాలు పెట్టుకున్న వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూస్తూనే ఉన్నారు. అయినా కూడా మార్పు రావడం లేదు. తాజాగా ఈ అక్రమ సంబంధం మూలానా ఓ నిండు గర్భిణీ తన ప్రాణాలని పోగొట్టుకుంది. భర్త తో విభేదించి ఆయనకి దూరంగా ఉంటున్న ఓ మహిళను అండగా ఉంటానని లొంగదీసుకుని చివరకు అతి దారుణంగా హత్యచేశాడు. తనని నమ్మిన పాపానికి  ఐదు నెలల గర్భవతిని హత్యచేశాడు. ఈ దారుణ ఘటన గుజరాత్ లోని బర్దోలీలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది.  ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. బర్దోలీకి చెందిన ఓ మహిళ  గత కొన్ని రోజులుగా భర్త నుండి దూరంగా ఉంటుంది.  ఉంటోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి అలాగే ప్రస్తుతం  మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే ఒంటరిగా ఉంటున్న ఆ మహిళా పై ఆమె ఇంటి సమీపంలోనే ఉండే ఓ వ్యక్తి కన్ను పడింది. భర్తకు దూరంగా ఉందని తెలుసుకుని తోడుగా ఉంటానని నాలుగు మాటలు చెప్పేసరికి ఆ మాటలు నమ్మిన మహిళ  అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని దాన్ని అలా కొనసాగిస్తూ వచ్చింది.

ఈ క్రమంలోనే గత ఆదివారం రాత్రి మూడేళ్ల కుమారుడిని తన తల్లి ఇంటి వద్ద ఉంచి వెళ్లిపోయింది. అలా వెళ్లిన మహిళ సోమవారం వరకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆమె ఆచూకీ మాత్రం లభించలేదు. దీనితో ఆ వ్యక్తి పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. తన కుమార్తె అతనితో గతకొంత కాలంగా సహజీవనం చేస్తోందని రష్మీ అతని వద్ద ఉండే అవకాశం ఉందని పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. వారి ఫిర్యాదు మేరకు స్పందిచిన అధికారులు ఆ వ్యక్తిని  అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించగా సంచలన విషయాలను వెల్లడించారు. ఆ గర్భవతి అయిన మహిళను హత్య చేసి జేసీబీ సహాయంతో తన తండ్రి ఫాంహౌస్ లో పూడ్చివేశానని చెప్పాడు. ఇద్దరి మధ్య విభేదాల కారణంగానే హత్య చేశానని ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.