Begin typing your search above and press return to search.

కన్న కూతురు మీద ఆ తండ్రి ఛండాలం..రాజకీయంగానూ సంచలనమైందే

By:  Tupaki Desk   |   14 Oct 2021 3:34 AM GMT
కన్న కూతురు మీద ఆ తండ్రి ఛండాలం..రాజకీయంగానూ సంచలనమైందే
X
కలలో కూడా ఊహించని రీతిలో చోటుచేసుకుంటున్న కొన్ని ఉదంతాల్ని చూస్తే.. నాగరిక సమాజంలోనే బతుకుతున్నామా? అన్న భావన కలుగక మానదు. తన రక్తం పంచుకు పుట్టిన కుమార్తెను లైంగికంగా వేధించే తండ్రుల్ని ఏం చేయాలి? ఈ మాటను అక్షరాల్లో రాయాలంటేనే ఒళ్లంతా వికారంగా మారిపోవటమే కాదు.. అలాంటి పిశాచాల్ని ఉత్తినే వదిలిపెట్టకూడదన్న ఆవేశంతో రక్తం మరిగిపోయేలా చేస్తుంది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈ దరిద్రపుగొట్టు తండ్రి.. కొందరు రాజకీయ నేతలకు తన కుమార్తెను బలి చేసిన వైనాన్ని బాధితురాలు స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు ఇచ్చిన వైనం ఇప్పుడు పెను సంచలనంగా మాత్రమే కాదు.. షాకింగ్ గా మారింది. యూపీలోని లలిత్ పూర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

ఇంటర చదువుతున్న ఒక బాలిక మీద కన్నతండ్రే కన్నేశాడు. కనుపాపల మాదిరి జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి.. తానే కాటేశాడు. ఆమెకు అసభ్యకరమైన చిత్రాల్ని చూపించి.. పలుమార్లు లైంగికంగా లొంగదీసుకోవటానికి ప్రయత్నించేవాడు. ఒక రోజున బైక్ మీద బయటకు తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారం చేయటమే కాదు.. ఆ విషయాన్ని ఇంకెవరికి చెప్పినా.. బాలిక తల్లిని చంపేస్తానని బెదిరించాడు. దీంతో భయంతోనూ.. తల్లి మీద ఉన్న ప్రేమతోనూ.. నోరు విప్పలేదు.

ఈ దురాగతంలోమరో దారుణమైన అంశం ఏమంటే.. బాధిత బాలికను హోటల్ కు తీసుకెళ్లి ఒక మహిళకు అప్పజెప్పాడు. బాలికకు మత్తుమందు ఇచ్చి.. పలువురితో అత్యాచారం చేయించేదా మహిళ. తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడినట్లుగా వాపోయిన బాధిత బాలిక.. తనను అత్యాచారం చేసిన వారిలో రాజకీయ నాయకులు ఉన్నట్లుగా వెల్లడించిన వైనం అందరిని ఉలిక్కిపడేలా చేసింది. లలిత్ పూర్ జిల్లా సమాజ్ వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిలక్ యాదవ్ తన మీద అత్యాచారానికి పాల్పడినట్లుగా వాపోయింది.

అంతేకాదు.. తిలక్ స్నేహితులు.. బంధువులు సైతం తనను లైంగికంగా హింసకు గురి చేశారని వేదన చెందింది. డబ్బుల కోసం తనను అమ్మే ప్రయత్నం చేశారని వెల్లడించారు. ఈ ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతానికి బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఆమె ఆరోపిస్తున్న దాని ప్రకారం.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన నేతలతో పాటు బీఎస్పీకి చెందిన నేతలు పలువురు నిందితులుగా మారే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న తిలక్ యాదవ్ ఒక ప్రకటనను విడుదలచేశారు. బాధితురాలి కావాలనే తనను.. తన సోదరుడ్ని టార్గెట్ చేసి.. కేసులో ఇరికించేలా చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో.. పోలీసుల విచారణ ఇప్పుడు కీలకంగా మారిందని చెప్పక తప్పదు.