పాడుబడ్డ థియేటర్..లోపల గగుర్పొడిచే దృశ్యాలు!!

Sun Jul 05 2020 11:30:58 GMT+0530 (IST)

Shocking Facts Revealed During Demolished Theatre in Rajanagaram

గత 50 ఏళ్లుగా ఆ దేవాదాయ శాఖ భూమి అన్యాక్రాంతమైంది. ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. ఇటీవల దేవాదాయ శాఖ భూముల లెక్కలు తీస్తున్న వైసీపీ సర్కార్ కు తూర్పు గోదావరి జిల్లా రాజానగరంలో దేవాదాయశాఖకు చెందిన స్థలాన్ని గుర్తించారు.ఇటీవల దాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ స్థలంలోనే ఉన్న పాడుబడ్డ లక్ష్మీ థియేటర్ ను శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు కూల్చడానికి ప్రయత్నించారు.

ఈ భూమిని ఆక్రమించుకున్న వారిలో ఒకరైన నున్న చంద్రావతి అనే మహిళ థియేటర్ ను కూలగొడితే ఒంటిపై కిరోసిన్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడుతానని బెదిరించింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

అనంతరం థియేటర్ బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన అధికారులకు బీతావాహ దృశ్యం కనిపించింది. భయాందోళనకు గురయ్యారు. మూడు లోతైన గోతులు పువ్వులు నిమ్మకాయలు కత్తి రక్తం ఏరులైపారడం.. క్షుద్రపూజలు చేశారు. గుప్త నిధుల కోసమే ఇలా చేసి ఉంటారని.. ఏదో బలి ఇచ్చి ఉంటారని దేవాదాయ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. జేసీబీ సాయంతో థియేటర్ ను కూల్చివేశారు. 

TAGS: