Begin typing your search above and press return to search.

అశ్లీల సైట్లోకి వెళ్తున్నారా? ఇవి తెలియ‌కుంటే య‌మ డేంజ‌ర్‌!

By:  Tupaki Desk   |   22 April 2021 7:30 AM GMT
అశ్లీల సైట్లోకి వెళ్తున్నారా? ఇవి తెలియ‌కుంటే య‌మ డేంజ‌ర్‌!
X
14 ఏళ్లు దాటిన త‌ర్వాత మ‌నిషిలో కామ వాంఛ‌లు మొద‌ల‌వ‌డం స‌హ‌జం.. వాటిని అదుపులో పెట్టుకునేందుకు ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ధ‌తిని పాటిస్తుంటారు. అది చేయ‌లేనివారు ఉద్రేకం చ‌ల్లార్చుకునే బాట‌లు వెతుకుతారు. అలాంటి దారుల్లో ఒక‌టే అశ్లీల వీడియోలు చూడ‌డం!

గ‌తంలో సీడీ, డీవీడీ ప్లేయ‌ర్ల ద్వారా ఇలాంటివి చూసేవారు. కానీ.. ఇప్పుడు స్మార్ట్ ఫోన్‌ విప్ల‌వం వ‌చ్చిన త‌ర్వాత అర‌చేతిలోనే అశ్లీల ప్ర‌పంచం సిద్ధంగా ఉంటోంది. ఎప్పుడు కావాలంటే.. అప్పుడు తెరిచి చూసుకోవ‌చ్చు. దీంతో.. టీనేజ‌ర్స్ మొద‌లు.. అలాంటి వీడియోలు అవ‌స‌ర‌మైన వాళ్లంతా ఫోన్లోనే చూసేస్తున్నారు.

ఇలాంటి వీడియోలు చూడ‌డం ప‌ట్ల సామాజికంగా, చ‌ట్ట‌ప‌రంగా వేర్వేరు నియంత్ర‌ణ‌లు, నిబంధ‌న‌లు ఉన్నాయి. అయితే.. వ్య‌క్తిగ‌తంగా నాలుగు గోడ‌ల మ‌ధ్య చూడ‌డం త‌ప్పేమీ కాద‌నే వాద‌న‌కూడా బ‌లంగానే ఉంది. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా.. అశ్లీల వీడియోల వీక్ష‌ణ మాత్రం హై రేంజ్ లో ఉంటోంది. అది మ‌న ద‌గ్గ‌ర ఎంత‌గా ఉందంటే.. ప్ర‌పంచంలో భార‌త దేశం మూడో స్థానంలో ఉంద‌ట‌!

మ‌న దేశంలో ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా అశ్లీల వీడియోలు చూసే వారు ఏకంగా 71 శాతం మంది ఉన్నార‌ట‌. ఇత‌ర మొబైల్ ఫోన్ల ద్వారా చూసే వారు 23 శాతం, ఐఫోన్ ద్వారా వీక్షించేవారు 6 శాతం మంది ఉన్నార‌ట‌. ఇందులో మెజారిటీ జ‌నం.. 18 నుంచి 24 సంవ‌త్స‌రాల లోపేనట‌. వీరంతా స‌గ‌టున‌ 8 నుంచి 10 నిమిషాల పాటు వీడియోలు చూస్తున్నార‌ట‌. ఓ అశ్లీల వెబ్ సైట్ నిర్వ‌హించిన స‌ర్వేలో ఈ విష‌యం వెల్ల‌డైంది.

ఎవ‌రో ఒక‌రి ద్వారా వెబ్ సైట్ అడ్ర‌స్ లు క‌నుక్కొని అందులోకి ప్రవేశిస్తున్నారు చాలా మంది. కానీ.. అదొక మాయా ప్ర‌పంచం అన్న సంగ‌తి వారికి తెలియ‌దు. కంటికి క‌నిపిస్తున్న‌దంతా నిజం కానే కాదు. ఎక్క‌డ ఏ మాల్ వేర్ పొంచి ఉంటుందో.. ఏది నొక్కితే ఏం జ‌రుగుతుందో అర్థంకాదు. అలా పొంచి ఉన్న ప్ర‌మాదాల్లో ఒక‌టి రాన్ స‌మ్ వేర్ సైబ‌ర్ దాడి ఒక‌టి. ఇది అటాక్ అయ్యిందంటే.. ఫోన్ లేదా సిస్ట‌మ్ హ్యాక‌ర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

అంటే.. బ్యాక్ ఎండ్ లో మ‌న ఫోన్ ను వాళ్లు ఆప‌రేట్ చేస్తుంటారు. అంతేకాదు.. ఫోన్లోని మొత్తం స‌మాచారం వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది. మ‌న ఫొటోలు, వీడియోల‌తోపాటు, బ్యాకింగ్ వంటి విలువైన విష‌యాలు తెలుసుకుంటారు. మొత్తం లూటీ చేసేస్తారు.

ఇంకా.. చాలా వెబ్ సైట్లు యూజ‌ర్ల‌ను లైవ్ చాట్ పేరుతో రెచ్చ‌గొడుతుంటాయి. ఇంకా మెసేజ్ లు పంపిస్తుంటాయి. లొకేష‌న్ యాక్సెస్ అడుతుంటాయి. ప్రీమియం మెంబ‌ర్ షిప్ తీసుకోండ‌ని ఊరిస్తుంటాయి. ఈ విధంగా.. ఎన్నో ర‌కాలుగా వ‌ల‌వేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంటాయి. ఇలాంటి వాటిపై క్లిక్ చేస్తే అంతే..! సో.. బీ కేర్ ఫుల్‌. ఇలాంటి గొడ‌వ ఎందుకులే అనుకుంటే.. వాటి జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిది.