Begin typing your search above and press return to search.

గల్వాన్ దెబ్బకు ఛైనాకు షాక్

By:  Tupaki Desk   |   16 Jun 2021 5:30 AM GMT
గల్వాన్ దెబ్బకు ఛైనాకు షాక్
X
జమ్మూ-కాశ్మీర్ లోయలోని గల్వాన్ లోయ గుర్తుండే ఉంటుంది. అవును లడ్డాఖ్ ప్రాంతంలోని గల్వాన్ లోయలో పోయిన ఏడాది మన సైన్యానికి డ్రాగన్ సైన్యానికి మధ్య పెద్ద ముష్టియుద్దమే జరిగింది. ఆ గొడవలో మనవాళ్ళు 20 మంది చనిపోతే డ్రాగన్ సైనికులు 45 మంది చనిపోయారు. ఆ ఘటన తర్వాత జరిగిన మరికొన్ని గొడవలు చైనాకు పెద్ద షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ‘బాయ్ కాట్ చైనా’ అనే నినాదం జనాల్లోకి బాగా వెళుతోందని సమాచారం.

బాయ్ కాట్ చైనా అంటే చైనా వస్తువులను కొనటం బాయ్ కాట్ చేయమనర్ధం. ప్రపంచంలో చైనా వస్తువులకు అతిపెద్ద మార్కెట్ మనదేశమే. చైనా తయారుచేస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే మొబైల్ ఫోన్లు, చార్జర్లు, ల్యాప్ ట్యాపులు, ట్యాబులు మొదలుకుని బొమ్మలు, టపాకాయలు, ఎటక్ట్రికల్ సామానులు తదితరాలన్నీ కలిపి మనదేశంలో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. ఇవన్నీ ఒకఎత్తైతే మొబైళ్ళలో వేసుకుని వాడే టిక్ టాక్ లాంటి యాప్ ల వ్యాపారం సంగతి చెప్పనే అక్కర్లేదు.

ఎప్పుడైతే గాల్వాన్ లోయలో మన సైన్యాన్ని చైనా సైనికులు దొంగదెబ్బ తీయటానికి ప్రయత్నించారో అప్పటి నుండి డ్రాగన్ ఉత్పత్తులపై మన దగ్గర వ్యతిరేకత మొదలైపోయింది. ఇదే విషయమై ‘లోకల్ సర్కికిల్’ అనే కమ్యూనిటి సోషల్ మీడియా దేశంలోని వివిధ ప్రాంతాల్లో సర్వే జరిపింది. గడచిన 12 మాసాల్లో అంతకుముందుతో పోల్చుకుంటే చైనా వస్తువుల కొనుగోళ్ళు మనదేశంలో 43 శాతం తగ్గిపోయినట్లు తేలింది.

మన దగ్గర వేల కోట్లరూపాయల వ్యాపారాలు చేసుకుని సంపాదించిన మన డబ్బుతో మనపైనే దొంగదెబ్బలు తీసే ప్రయత్నాలతో మనజనాలకు బాగా మండిపోయింది. ఆ మంటను బాయ్ కాట్ చైనా ద్వారా వ్యక్తంచేస్తున్నారు. ఇందులో భాగంగానే చైనా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. అందుకనే ఇపుడు మనదేశంలో చైనా ఉత్పత్తులను కొనేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఇంతలో ఎంత మార్పు..మార్పు మంచిదే కదా .