Begin typing your search above and press return to search.

చైనాకు షాక్ ..బ్రెజిల్ కు భారత్ కోవాగ్జిన్ వ్యాక్సిన్

By:  Tupaki Desk   |   13 Jan 2021 10:30 AM GMT
చైనాకు షాక్ ..బ్రెజిల్ కు భారత్ కోవాగ్జిన్ వ్యాక్సిన్
X
కరోనా పుట్టిన చైనా దేశంతో ఇన్నాళ్లు ఒప్పందం కుదుర్చుకొని ఆ దేశం టీకాను పరీక్షించిన బ్రెజిల్ దేశం షాక్ తిన్నది. బెజ్రిల్ దేశం జరిపిన పరీక్షల్లో చైనా వ్యాక్సిన్ కేవలం 50.4శాతం మాత్రమే సమర్థత చూపించడంతో అవాక్కైంది. ఈ క్రమంలోనే బ్రెజిల్ దేశం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. కరోనా మహమ్మారితో అల్లాడిపోతున్న బ్రెజిల్ దేశానికి ఇప్పుడు భారత్ నుంచి కరోనా టీకా వెళ్లనుంది.

ఇప్పటికే మన దేశ ఫార్మాసంస్థలతో బ్రెజిల్ సంప్రదింపులు జరిపింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా తీసుకునేందుకు బ్రెజిల్ దేశం ముందుకొచ్చింది. బ్రెజిల్ మెడికల్ ఏజెన్సీ ప్రెసిసా మెడికామెంటోస్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తాజాగా భారత్ బయోటెక్ ప్రకటించింది.

జనవరి 7,8 వ తేదీల్లో బ్రెజిల్ ప్రెసిఫా ప్రతినిధులు హైదరాబాద్ లోని కేంద్రాన్ని సందర్శించినట్లు భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. కోవాగ్జిన్ పూర్తి సురక్షితం అని తేలడంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచుతోందని.. మంచి పనితీరు కనబరుస్తోందని రుజువైందని తెలిపారు.

బ్రెజిల్ దేశ ప్రజల ఆరోగ్య అవసరాలకు భారత్ లో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు ఉపయోగపడుతాయని భారత్ బయోటెక్ ఎండీ తెలిపారు.

ఇక భారత్ బయోటెక్ టీకా తమ అంచనాలకు మించి ఉందని బ్రెజిల్ ఫార్మా సంస్థ డైరెక్టర్ మోడ్రాడెస్ తెలిపారు. అందుకే భారత్ బయోటెక్ తో ఒప్పందం చేసుకున్నామని వివరించారు.

భారత్ లో ఇప్పటికే కోవీషీల్డ్ తోపాటు కోవాగ్జిన్ టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. జనవరి 16 నుంచి ఈ వ్యాక్సిన్ పంపిణీ చేయనున్నారు.