Begin typing your search above and press return to search.

డ్రగ్స్​ తీసుకోవాలని నన్ను ఫోర్స్​ చేశారు..నేను లొంగలేదు..షోయబ్​ అక్తర్​

By:  Tupaki Desk   |   26 Nov 2020 5:00 AM GMT
డ్రగ్స్​ తీసుకోవాలని నన్ను ఫోర్స్​ చేశారు..నేను లొంగలేదు..షోయబ్​ అక్తర్​
X
‘క్రికెట్​ లో రాణించాలంటే డ్రగ్స్​ తీసుకోవాల్సిన అవరం లేదు. మనలో ఆత్మవిశ్వాసం ఉండాలి. ప్రయత్నం ఉండాలి. అప్పుడే రాణిస్తాం. బంతిని వేగంగా విసిరేందుకు చాలామంది డ్రగ్స్​తీసుకోమని నన్ను ఫోర్స్​ చేశారు. కానీ నేను లొంగలేదు’ అని మాజీ బౌలర్​ షోయబ్​ అక్తర్​ పేర్కొన్నారు. పాకిస్థాన్​లో మాదకద్రవ్యాల నిరోధకశాఖ నిర్వహించిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ నాకు చాలామంది డ్రగ్స్​ తీసుకోవాలని సలహాఇచ్చారు. ఇప్పుడు వాళ్ల పేర్లు చెప్పలేను. కానీ డ్రగ్స్​ తీసుకోకుండానే నేను రాణించాను. ఇప్పుడు చాలామంది యువతను తప్పుదోవ పట్టిస్తున్నారు.

బౌలింగ్​ - బ్యాటింగ్​ - ఫీల్డింగ్​ ఏరంగంలో రాణించాలన్నా ప్రాక్టీస్​ ముఖ్యం’ అని అక్తర్​ చెప్పుకొచ్చారు. షోయబ్​ అక్తర్​ ప్రపంచంలోనే నంబర్​వన్​ ఫాస్ట్​బౌలర్​గా (బౌలింగ్​ స్పీడ్​ పరంగా) నిలిచాడు. వన్డే క్రికెట్​ చరిత్రలో 161 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి రికార్డ్​ నెలకొల్పాడు. షోయబ్​ అక్తర్​ 151 కిలోమీటర్ల సరాసరి వేగంతో బంతులను విసిరేవాడు. 2002లో న్యూజిలాండ్‌ పై 161 కిలోమీటర్ల వేగంతో బంతిని వేసి ఈ ఘనత సాధించాడు. పాకిస్థాన్ తరఫున 46 టెస్టులు - 163 వన్డేలు - 15 టీ20లు ఆడిన అక్తర్.. 2010 లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. తన కెరీర్‌ లో మొత్తం 444 వికెట్లు తీశాడు.

‘మంచి భవిష్యత్​ కోసం మత్తు లో జోగకండి. నిరంతర వ్యాయామం, ప్రాక్టీస్​ చేసి రాణించండి. కొంతమంది తప్పుడు మాటలు విని మీ జీవితాలను నాశానం చేసుకోకండి’ అని సూచించాడు. షోయబ్​ అక్తర్​ను పాకిస్థానీయులు ముద్దగా రావల్పిండి ఎక్స్​ప్రెస్​గా పిలుచుకుంటారు. తన క్రికెట్​ జీవితంలో ఆనేకసార్లు వివాదాల్లో చిక్కుకున్నాడు. గతంలో ఓసారి అక్తర్ ​పై డ్రగ్స్​ తీసుకుంటాడనే విమర్శ వచ్చింది. కొంతకాలం జట్టు నుంచి నిషేధించారు కూడా.