నా కొడుకును చంపినట్లు వాళ్లను ఎందుకు చంపలేదు

Fri Dec 06 2019 16:58:45 GMT+0530 (IST)

దిశ నిందితులను ఈరోజు ఉదయం పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. దేశవ్యాప్తంగా దీనిపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తన కొడుకును చంపడంపై తాజాగా జొల్లు శివ తండ్రి స్పందించాడు. మహబూబ్ నగర్ జిల్లా నారాయణ పేటలోని ఆయన స్వగృహంలో తన కొడుకును ఎన్ కౌంటర్ చేశారన్న వార్త విన్నాక వారు శోకసంద్రంలో మునిగిపోయారు.తాజాగా జొల్లు శివ తండ్రి మీడియాతో మాట్లాడుతూ దేశంలో చాలా హత్యలు అత్యాచారాలు ఆ తర్వాత హత్యలు జరిగాయని.. వారందరినీ ఏమీ చేయని పోలీసులు తమ కొడుకును ఈ నలుగురిని మాత్రమే ఎందుకు చంపారని ప్రశ్నించారు.

అత్యాచారాలు హత్యలు చేసిన వారందరూ ఇప్పుడు బయట చాలా మంది తిరుగుతున్నారని.. తమ కొడుకులు అతడి స్నేహితులు మాత్రం ఏం పాపం చేశారని ఆయన పోలీసులను ప్రశ్నించారు.

తమ కొడుకును చంపినట్టే రేప్ చేసి చంపిన వాళ్లందరినీ పోలీసులు చంపాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు ఒక న్యాయం.. మిగతా వారికి ఒక న్యాయమా అని నిందితుడైన జొల్లు శివ తండ్రి ప్రశ్నించాడు