Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై వివాదాస్ప‌ద నేత హాట్ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   26 Sep 2022 11:32 AM GMT
కాంగ్రెస్ అధ్య‌క్ష ఎన్నిక‌ల‌పై వివాదాస్ప‌ద నేత హాట్ కామెంట్స్‌!
X
రాజ‌స్థాన్ కాంగ్రెస్‌లో ర‌గ‌డ కొన‌సాగుతోంది. అశోక్ గెహ్లోత్ కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా పోటీ చేయ‌నున్న నేప‌థ్యంలో అక్క‌డ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఆయ‌న రాజీనామా చేయాల్సి వ‌స్తోంది. అయితే తన స్థానంలో తాను సూచించిన‌వారికే సీఎం ప‌ద‌వి ఇవ్వాల‌ని అశోక్ గెహ్లోత్ మంకుప‌ట్టు ప‌డుతున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. అంతేకాకుండా అశోక్ గెహ్లోత్‌కు మ‌ద్ద‌తుగా ఉన్న 92 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా తమ రాజీనామాల‌ను సైతం స్పీక‌ర్ సీపీ జోషికి అందించార‌ని ప్ర‌సార మాధ్య‌మాలు పేర్కొన్నాయి.

త‌న‌ను ప‌ద‌వీచ్యుడితిని చేయ‌డానికి స‌చిన్ పైల‌ట్ గ‌తంలో ప్ర‌య‌త్నించ‌డంపై అశోక్ గెహ్లోత్ అప్ప‌టి నుంచి ఆగ్ర‌హంగా ఉన్నారు. ఓవైపు స‌చిన్ పైల‌ట్.. రాహుల్ గాంధీకి స‌న్నిహితుడిగా ఉన్నారు. మ‌రోవైపు అశోక్ గెహ్లోత్.. గాంధీల కుటుంబానికి న‌మ్మిన‌బంటుగా ఉన్నారు. అయితే రాహుల్ మొగ్గు స‌చిన్ పైల‌ట్ వైపే ఉంది. ఈ విష‌యం తెలుసుకున్న అశోక్ గెహ్లోత్ రాజ‌స్థాన్ ఎమ్మెల్యేల ద్వారా చ‌క్రం తిప్పుతున్నారు. తమ వ‌ర్గంలో ఉన్న 92 మంది ఎమ్మెల్యేల్లోనే ఎవ‌రో ఒక‌రిని ముఖ్య‌మంత్రిని చేయాల‌ని వారంతా కోరుతున్నారు.

మ‌రోవైపు వివాదం ప‌రిష్కారానికి కాంగ్రెస్ అధిస్టానం సీనియ‌ర్ నేత‌లు అజయ్ మాకెన్, వేణుగోపాల్‌ను పంపింది. అయితే అశోక్ గెహ్లోత్.. స‌చిన్ పైల‌ట్‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డానికి స‌సేమిరా అంటున్నార‌ని చెబుతున్నారు. దీంతో అజ‌య్ మాకెన్, వేణుగోపాల్ ఏమీ చేయ‌లేక ఢిల్లీకి తిరిగొచ్చేశార‌ని అంటున్నారు. దీంతో మ‌ధ్యేమార్గంగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి క‌మ‌ల్‌నాథ్‌ను అశోక్ గెహ్లోత్ వ‌ద్ద‌కు పంప‌డానికి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణ‌యం తీసుకుంది. క‌మ‌ల్ నాథ్.. అధిష్టానం నిర్ణ‌యాన్ని అశోక్ గెహ్లోత్ కు న‌చ్చ‌చెప్పాల్సి ఉంటుంది.

మ‌రోవైపు కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వి కోసం అశోక్ గెహ్లోత్ తో పోటీ ప‌డుతున్న తిరువ‌నంత‌పురం కాంగ్రెస్ ఎంపీ శ‌శిథ‌రూర్ హాట్ కామెంట్స్ చేశారు. దేశవ్యాప్తంగా త‌న‌కుఏ పార్టీ కార్యకర్తల మద్దతు ఉంద‌న్నారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికలకు తాను నామినేషన్‌ దాఖలు చేశాక త‌న‌కు ఉన్న ఫాలోయింగ్ ను చూస్తార‌న్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన మెజార్టీ కాంగ్రెస్ నేతలు తాను పోటీ చేయాలని ఇప్పటికే కోరార‌ని తెలిపారు.

కాగా ప్ర‌స్తుతం భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాహుల్‌ గాంధీ కేరళలో ఉన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీని శశిథరూర్ కల‌వ‌డం విశేషం. అయితే తాను మ‌ర్యాద‌పూర్వ‌కంగానే రాహుల్ ను క‌లిశాన‌ని శ‌శిథ‌రూర్ తెలిపారు. పాలక్కడ్ త‌న‌ సొంత జిల్లా అని రాహుల్‌ ఇక్కడ ఉన్నారు కాబట్టే మర్యాదపూర్వకంగా వెళ్లి ఆయ‌నను క‌లిశాన‌ని చెప్పారు.

శ‌శిథ‌రూర్ ఈ నెల 30న కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి నామినేష‌న్ దాఖ‌లు చేయనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎంపీ శశిథరూర్‌, రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ల‌కు పార్టీ అధిష్టానం ఇప్ప‌టికే ఆమోదం తెలిపింది. అక్టోబర్ 17న ఓటింగ్ నిర్వ‌హిస్తారు. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 19న వెలువ‌డ‌తాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.