జూలై 8న షర్మిల కొత్త పార్టీ.. వడివడిగా అడుగులు

Wed Jun 09 2021 12:00:41 GMT+0530 (IST)

Sharmila new party on July 8

కొత్త పార్టీ ప్రకటన తేది దగ్గరపడడంతో వైఎస్ షర్మిల ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్ ఆఫీస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక భేటి నిర్వహించబోతున్నారు. జూలై 8న కొత్త పార్టీ ఏర్పాటుపై షర్మిల ఈ సన్నాహక సమావేశంలో చర్చిస్తారు. పార్టీకి సంబంధించి గ్రామీణ మండల జిల్లా స్థాయి అడ్ హక్ కమిటీలను కూడా షర్మిల ఇవాళే ప్రకటించనున్నారు.షర్మిల తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేస్తోన్న పొలిటికల్ పార్టీ పేరు ‘వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ’గా నిన్ననే ఆ పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. పార్టీ పేరుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కూడా పూర్తయినట్టుగా సమన్వయకర్త రాజగోపాల్ ప్రకటించారు.

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి  జయంతి రోజున జులై 8న వైఎస్ షర్మిల పార్టీ పేరును బహిరంగంగా ప్రకటిస్తారు. పార్టీ ఆవిర్భావానికి కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లను కార్యక్రమాలను ఇప్పటికే ప్రారంభించారు. పార్టీ పేరుపై అభ్యంతరం లేదని ఎన్నికల సంఘానికి విజయమ్మ లేఖ రాసినట్లు రాజగోపాల్ వెల్లడించారు.

ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని రాజగోపాల్ స్పష్టం చేశారు. ఇలా ఉండగా.. తెలంగాణ పాలిటిక్స్ లో అరంగేట్రం షూరూ చేసిన వైఎస్ షర్మిల రోజురోజుకూ దూకుడు పెంచుతున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ గా షర్మిల తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ నిరుద్యోగ సమస్య  ప్రభుత్వ ఉద్యోగాలు రైతులు వెతలు తదితర అంశాల మీద షర్మిల ప్రశ్నలు సంధిస్తున్నారు.

కాగా ఇప్పటికే షర్మిల 9మంది అధికార ప్రతినిధులను సైతం ఇప్పటికే నియమించారు. గ్రామీణ మండల జిల్లాస్థాయి అడ్ హక్ కమిటీలు కూడా ప్రకటిస్తూ ముందుకు సాగుతున్నారు.