ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన.. ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేత

Fri May 13 2022 20:10:09 GMT+0530 (IST)

Shareholders and Investors Still Fear Twitter Deal

ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించారు. ట్విట్టర్ కొనుగోలుకు ముందుకొచ్చిన ఆయన తాజాగా ఈ షాకింగ్ ప్రకటన చేశాడు. తాజాగా ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. దీనికి సంబంధించిన విసయాన్ని ఎలన్ మస్క్ తన ట్విట్టర్ లో వెల్లడించారు. స్వామ్ ఫేక్ అకౌంట్లు లెక్క తేల్చాలని మస్క్ అంటున్నారు. స్వామ్ ఫేక్ అకౌంట్లు 5శాతం లోపేనని ట్విట్టర్ అంటోంది.44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్ ను కొనేందుకు ఎలన్ మస్క్ ప్రయత్నం చేశారు. స్వామ్ ఫేక్ అకౌంట్ల విషయంలో వివరాలు పెండింగ్ లో ఉన్నాయని.. అందుకే ఈ డీల్ ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. మస్క్ ప్రకటనతో మార్కెట్ లో ట్విట్టర్ షేర్లు 20శాతం పడిపోయాయి. దీనిపై వెంటనే స్పందించేందుకు ట్విట్టర్ సంస్థ నిరాకరించింది.

తమ ట్విట్టర్ అకౌంట్లలో కేవలం 5శాతం మాత్రమే ఫేక్ లేదా స్పామ్ అకౌంట్లు ఉన్నట్లు గతంలో ట్విట్టర్ తెలిపింది. కాగా ఇవాళ ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లను తొలగిస్తూ ట్విట్టర్ నిర్ణయం తీసుకుంది.

ఇటీవలే ఎలన్ మస్క్ $44 బిలియన్ డాలర్లతో ట్విట్టర్ టేకోవర్ డీల్‌ను విజయవంతంగా చేరుకున్నాడు. "కొత్త ఫీచర్లతో ఉత్పత్తిని మెరుగుపరచడం నమ్మకాన్ని పెంచడానికి అల్గారిథమ్‌లను ఓపెన్ సోర్స్ చేయడం స్పామ్ బాట్‌లను నివారించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ట్విట్టర్‌ను గతంలో కంటే మెరుగ్గా మార్చాలనుకుంటున్నాను" అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశాడు.

ట్విట్టర్ ఎలన్ మస్క్ చేతుల్లోకి వెళ్లాక అందులో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. వాక్ స్వాతంత్య్రానికి మరింత అనువైన వేదికగా ట్విట్టర్ ను తీర్చిదిద్దుతానని.. కొత్త ఫీచర్లను తీసుకొస్తానని ఎలన్ మస్క్ స్పష్టం చేశారు. అంతలోనే ట్విట్టర్ డీల్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు.