‘నీ భార్యను పంపించరా’ స్టోక్స్‌పై మార్లోన్ శామ్యూల్స్ కామెంట్లు.. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం!

Thu Oct 29 2020 08:30:31 GMT+0530 (IST)

Shane Warne Fires On Marlon Samules


వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్‌పై మరో వివాదంలో చిక్కుకున్నాడు. తనస్థాయిని మరిచిపోయి చిల్లర కామెంట్ పెట్టాడు. ఓ అంతర్జాతీయ క్రికెటర్‌ను అన్న ఇంగితజ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించాడు. సాటి క్రికెటర్‌ను అతడి భార్యను గురించి నీచంగా మాట్లాడటంతో సోషల్ మీడియాకు టార్గెట్ గా మారాడు. ఇంతకూ ఏం జరిగిందంటే..
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు ఆడుతున్నాడు. కరోనా కారణంగా ఆలస్యంగా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే టోర్నీకి వచ్చేకంటే ముందు కరోనా ప్రొటోకాల్స్ ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. అంతకు ముందుకూడా తల్లదండ్రులకు అనారోగ్యం ఉండటంతో పాకిస్థాన్ టెస్ట్ సిరీస్ నుంచి అర్దాంతరంగా తప్పుకున్నాడు. అయితే క్వారంటైన్ గురించి ఇటీవల స్టోక్స్ మీడియాతో మాట్లాడారు. ‘క్వారంటైన్ అనేది నిజంగా ఓ నరకం. ఈ పరిస్థితి పగవాడికి కూడా రావోద్దు. నేను బద్ద శత్రువుగా భావించే శ్యామూల్స్‌కు కూడా రావద్దని కోరుకుంటా’ అంటూ సరాదాగా వ్యాఖ్యానించాడు. అయితే స్టోక్స్ కామెంట్లను శ్యామూల్స్ సీరియస్‌గా తీసుకున్నాడు. దీంతో ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని టార్గెట్ చేస్తూ చాలా నీచంగా పోస్టు పెట్టాడు. ‘ఈ తెల్లోడు ఇంకా నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. 14 రోజులు నీ భార్యను పంపించరా..  14 సెకన్లలో జమైకన్‌గా మార్చుతా.' అంటూ రాసుకొచ్చాడు. అంతేకాక మరో క్రికెటర్ షేన్వార్న్పై కూడా శ్యామూల్స్ అసభ్యకర పోస్ట్ పెట్టాడు.  దీంతో శ్యామూల్స్ పోస్ట్‌లపై తీవ్ర దుమారం రేగుతున్నది. శ్యామూల్స్ అనుచిత వ్యాఖ్యలపై షేన్ వార్న్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎవరి తోడు స్నేహం లేక శ్యామూల్స్ పిచ్చోడవుతున్నాడని అతనికి ఎవరైనా సాయం చేయాలని ట్వీట్ చేశాడు.

'నాతో పాటు స్టోక్స్‌పై చేసిన వ్యాఖ్యలను ఇప్పుడే తిరిగి శామ్యూల్స్‌కు పంపించా. అతని వ్యాఖ్యలు సరైనవి కావు. ఒక వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడడంతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఇందులోకి లాగడం బాధాకరమైన విషయం.శామ్యూల్స్‌కు మతి చెడింది.. ఇప్పుడు అతనికి సహాయం అవసరం. కానీ దురదృష్టం కొద్దీ అతనికి స్నేహితులు ఎవరు లేరు.. కనీసం తోటి క్రికెటర్లు కూడా అతనికి సాయంగా రారు. ఎందుకంటే అతనొక సాధారణ క్రికెటర్.. అందుకే ఎవరి వద్ద నుంచైనా వెంటనే సాయం కోరు ' అంటూ షేన్‌వార్న్ పేర్కొన్నాడు. మరోవైపు శ్యామ్యూల్స్ కామెంట్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. అతడిని వెంటనే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.