షారుఖ్ ఖాన్ ప్రతీకారం మొదలుపెట్టాడు!

Wed Nov 24 2021 05:00:01 GMT+0530 (IST)

Shahrukh Khan has started revenge

తన కొడుకు డ్రగ్స్ కేసులో ఇరికించి దాదాపు 27 రోజులు జైల్లో పెట్టిన ఎన్సీబీపై బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ప్రతీకారం తీర్చుకోవడానికి రెడీ అయ్యాడా? అంటే ఔననే సమాధానం వస్తోంది. తన తనయుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ వినియోగదారుడిగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి.. తనకు నిద్రలేని రాత్రులను మిగిల్చిన ఎన్సీబీపై బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అయినట్టు సమాచారం.క్రూయిజ్ షిప్ లో ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ను కొన్నాళ్ల కిందటే ఇచ్చిన ముంబై కోర్టు.. బెయిల్ స్టేట్ మెంట్ ను ఇటీవలే విడుదల చేసింది. ఆ స్టేట్ మెంట్ ప్రకారం.. ఆర్యన్ కాన్ పై ఎన్సీబీ అధికారులు అభియోగాలు మోపారు. ఈ అభియోగాలు ఆధారాలతో కూడుకున్నవి కాదని కోర్టు స్పష్టం చేసి బయిల్ ఇచ్చింది.

ఆర్యన్ ఖాన్ ను బలమైన డ్రగ్స్ వినియోగదారుగా ఎన్సీబీ చూపించింది. దానికి అతడి వాట్సాప్ చాట్ లను ఆధారంగా చూపించింది. కోర్టుకు సమర్పించింది.  కోర్టుకు మాత్రం ఆ వాట్సాప్ చాట్ లిస్టులో తప్పేం కనిపించలేదు. ఆధారాలు లేనివని కోర్టు కొట్టివేసింది. ఆర్యన్ అతడి స్నేహితుల నుంచి పోలీసులు తీసుకున్న కన్ఫెషన్ స్టేట్ మెంట్ కూడా చెల్లదని కోర్టు స్పష్టం చేసింది.

ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కేసు విచారణలో కీలక పాత్ర పోషించిన సమీర్ వాంఖడే తీరు వివాదాస్పదమైంది. అతడు కావాలనే సినీ సెలబ్రెటీలను టార్గెట్ చేశాడని.. లంచాలు అడిగాడని ఆరోపణలు వచ్చాయి. స్వయంగా మహారాష్ట్ర మంత్రి ఈ ఆరోపణలు చేశారు. ప్రత్యక్ష సాక్షులు కూడా సమీర్ వాంఖడే డబ్బులు ఆశించాడని.. సంప్రదింపులు కూడా జరిగాయని కూడా ప్రత్యక్ష సాక్షి చెప్పడం సంచలనంగా మారింది.

ఈ క్రమంలోనే తన కొడుకును కటకటాల పాలు చేసిన సమీర్ వాంఖడేను ఎన్సీబీని వదిలిపెట్టకూడదని షారుఖ్ ఖాన్ డిసైడ్ అయ్యాడట.. ఈ మేరకు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నాడని సమాచారం. తన కొడుకును ఈ కేసులో ఫ్రేమ్ చేశారని..కోర్టును ఆశ్రయించబోతున్నట్టుగా సమాచారం. మరి అదే నిజమైతే ఈ కేసులో ఎన్సీబీ ముంబై విభాగం గట్టి విచారణను ఎదుర్కోవాల్సి ఉంటుంది.