సొంత మేనత్తే బాలుడిపై లైంగిక దాడి: ఎలా బయటపడిందో తెలుసా..?

Sun Dec 05 2021 13:00:01 GMT+0530 (IST)

Sexual assault on own niece boy

డబ్బు సంపాదన కోసం కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. మానవ విలువలను మంటగలుపుతూ ఇష్టమొచ్చిన రీతిలో ప్రవర్తిస్తూ కొందరు కి‘లేడీ’లు  మొగాళ్లను వలలో వేసుకుంటున్నారు. అందమైన ముఖాన్ని చూపించి.. ఆస్వాదించడానికి ఇంటికి రావాలని చెప్పి అసభ్య పనులు చేస్తున్నారు.  ఆపై లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు. ఆ తరువాత లబోదిబోమంటున్నారు బాధితులు. అయితే అక్కడ ఓ తొమ్మిదోతరగతి బాలుడిని ఇదే రకంగా మోసం చేసిందీ ఓ మహిళ. అంతేకాకుండా ఆ మహిళ బంధువు కావడం గమనార్హం.హైదరాబాద్లో మూడేళ్ల కిందట జరిగిన ఈ ఘటన తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. వారి చెప్పిన వివరాల ప్రకారం.. జూబ్లిహిల్స్ లో నివాసముంటున్న ఓ కుటుంబం ఒకరోజు తన బీరువాను చెక్ చేశారు. అందులో నగలు కనిపించలేదు. ఎంతవెతికిగా కనిపించకపోవడంతో బాలుడిపై అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు. దీంతో బాలుడు బెంగుళూరులో ఉన్న మేనత్త వాళ్ల ఇంట్లో ఉన్నాయని చెప్పాడు. ఎందుకిచ్చావని బాలుడిని అడుగగా అసలు విషయాన్ని చెప్పాడు.

సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో తన మేనత్త ఆ బాలుడిని లోబర్చుకుంది. చార్మినార్ వద్ద ఓ లాడ్జి రెంట్ కు తీసుకొని ఆ బాలుడిని అక్కడికి రమ్మని చెప్పింది. ఇద్దరు కలిసి లాడ్జిలోకి వెళ్లారు. ఆ తరువాత బాలుడితో లైంగికంగా ఉన్న ఫొటోలు వీడియోలను ను వేరే వ్యక్తితో తీయించింది. ఆ తరువాత  తనకు బంగారం ఇవ్వాలని లేదంటే ఆ వీడియోలను బయటపెడుతానని బాలుడిని బెదిరించింది.  దీంతో భయపడిన ఆ బాలుడు 20 తులాల బంగారాన్ని  ఆమెకు ఇచ్చినట్లు బాలుడు పోలీసులకు తెలిపాడు. అంతేకాకుండా మరోసారి ఇలాగే బెదరించడంతో రూ.6 లక్షలు ఇచ్చినట్లు పేర్కొన్నాడు. తనమూ మూడుసార్లు లైంగిక దాడి చేసిందని వివరించాడు.

దీంతో బాలుడి మేనత్తపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపింది. నిందితురాలిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇలా తన దగ్గరి బంధువై ఉండి కూడా ఇలాంటి పనులకు పాల్పడినందుకు ఆమె గురించి రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ఈమధ్య విపరీతంగా పెరిగిపోయాయి. అందం ఆశ చూపి మొగాళ్ల ఫొటోలు వీడియోలు తీసి బయటపెడుతానని బెదరిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు భయపడి లక్షల రూపాయలు ముట్టజెప్పుతున్నారు.

మహిళలే  కాకుండా కొందరు యువతులు సైతం ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి మొగాళ్లను వలలో వేసుకుంటున్నారు. కొన్ని రోజుల పాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి వారితో గడిపి సీక్రెట్ గా వీడియోలు తీస్తున్నారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే పోలీసులకు చెబుతానని బెదరిస్తున్నారు. అందం మోజులో పడ్డ కొందరు అడిగినంతా ఇస్తున్నారు. అయితే వీరిలో ఫ్యామిలీలు ఉన్నవారు కూడా ఉండడం గమనార్హం. ఇప్పటికే చాలా మంది కిలేడీ గురించి వార్తలు వస్తున్నాయి. అయినా చాలా మంది అమ్మాయిల మోసానికి గురవుతున్నారు. పోలీసులు సైతం ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. డైటింగ్ పేరుతో కొందరు మెసేజ్లు చేసి వలలో వేసుకుంటారని చెబుతున్నారు. కొత్త నెంబర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.