Begin typing your search above and press return to search.

‘స్టాకర్ వేర్’ వాడకంపై సర్వే: సంచలన విషయాలు వెలుగులోకి..?

By:  Tupaki Desk   |   25 Nov 2021 11:30 PM GMT
‘స్టాకర్ వేర్’ వాడకంపై సర్వే: సంచలన విషయాలు వెలుగులోకి..?
X
ప్రతీ వ్యక్తి తాను ఇంట్లో లేనప్పుడు తన భాగస్వామి ఏం చేస్తుందో తెలుసుకోవాలనుకుంటాడు. మొన్నటి వరకు ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వారు ఏం చేసేవారో తెలుసుకునేవారు. కానీ వీటి వల్ల ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిని వారు విడిపోవడానికి కారణమయ్యాయి. అయితే ఈ పద్దతి పాటించకున్నా చాలా మంది తన వారు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటారు.

వీరికి తగ్గట్లుగా కొందరు టెక్నాలజీలో మార్పులు చేసి కొత్త కొత్త యాప్స్ తీసుకొచ్చారు. ఇందులో ప్రధానమైనది స్టాకర్ వేర్ యాప్స్. తమ జీవిత భాగస్వామిపై అపనమ్మకం ఉన్నవారు ఈ యాప్స్ వారి ఫొన్లోకి పంపించి వారి గురించి పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఇటీవల కొందరు స్టాకర్ వేర్ యాప్స్ వాడని వారిపై పరిశోధనలు నిర్వహించారు. దీంతో వారికి భయంకర నిజాలు తెలిశాయి.

ఎదుటి వ్యక్తి ఎక్కడున్నాడు..? ఎవరికి మెసేజ్ పంపుతున్నాడు..? ఎవరితో మాట్లాడుతున్నాడు..? అనే విషయాలు తెలుసుకోవడానికి స్టాకర్ వేర్ యాప్స్ ను తయారు చేశారు. తాను ఓ వ్యక్తి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు అతని మొబైల్ లోకి ఈ స్టాకర్ వేర్ యాప్ ను వారికి తెలియకుండానే పంపిస్తారు.

ఆ తరువాత వారు చేసే పనులను ట్రాక్ చేస్తారు. దీంతో వారు ఏం చేసిన సంబంధిత వ్యక్తికి అట్లే తెలిసిపోతుంది. చాలా మంది తమ జీవిత భాగస్వామి గురించి తెలుసుకోవడానికి దీనిని వాడుతున్నట్లు ఇటీవల నిర్వహించిన సర్వేలో తేలింది.

ప్రముఖ సైబర్ సెక్యూరిటీ దిగ్గజం కాస్పర్ స్కై ఇటీవల స్టాకర్ వేర్ యాప్స్ పై పరిశోధనలు చేసింది. ఆ సంస్థ చేపట్టిన సర్వేలో ప్రతి 10 మందిలో ముగ్గురు స్టాకర్ వేర్ వాడుతున్నట్లు తేలింది. 21 దేశాల్లోని 21 వేల మంది పై కాస్పర్ స్కై పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనల్లో స్టాకర్ వేర్ యాప్స్ వాడుతున్న వారిని గుర్తించింది.

ఈ సంవత్సరం 10 నెలల్లో 28 వేల మంది మొబైల్ వినియోగదారులు స్టాకర్ వేర్ యాప్స్ ను వాడుతున్నట్లు తెలిసింది. వీటిలో ఎక్కువగా యూరోపియన్ యూనియన్లో 3,100 కంటే ఎక్కువ కేసులు, ఉత్తర అమెరికాలో 2,300 కంటే ఎక్కువం మంది వినియోగదారులు స్టాకర్ వేర్ యాప్స్ వాడుతున్నట్లు బయటపడింది.

స్టాకర్ వేర్ యాప్స్ పై గూగుల్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సాప్ట్ వేర్ కు సంబంధించిన యాడ్స్ కనిపించకుండా చేసింది. జీవిత భాగస్వాములపైన నిఘా పెట్టే ఈ యాప్ పై కఠిన వైఖరి అవలంభిస్తోందని గూగుల్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. అయితే స్టాకర్ వేర్ మరికొన్ని యాప్స్ ను గూగుల్ ప్లేలోకి చొప్పించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంలో ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నామని గూగుల్ ప్రతినిధులు తెలుపుతున్నారు.