Begin typing your search above and press return to search.

కేసీఆర్ పోస్ట్ ఇస్తానంటున్న ఐఏఎస్‌ లు వ‌ద్దంటున్నారు!

By:  Tupaki Desk   |   15 Dec 2019 7:09 AM GMT
కేసీఆర్ పోస్ట్ ఇస్తానంటున్న ఐఏఎస్‌ లు వ‌ద్దంటున్నారు!
X
తెలంగాణ‌లో నెల‌కొన్న ఆ ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాల గురించి అధికార వ‌ర్గాల్లో ఓ హాట్ చ‌ర్చ జ‌రుగుతోంది. రాజ‌కీయ నాయ‌కులు సైతం ఓ కంట క‌నిపెడుతూ ఉండే ముఖ్య విష‌యంలో....ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రి - దానికి సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల స్పంద‌న ప్ర‌స్తుతం వార్తల్లో నిలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌ కె జోషి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఐఏఎస్‌ లు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకునే ఈ ప‌ద‌వి విష‌యంలో తెలంగాణ మాత్రం...పెద్ద‌గా క్రేజ్ లేద‌ని అంటున్నారు. దానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ వైఖ‌రిని ప్ర‌స్తావిస్తున్నారు.

వాస్త‌వంగా ప‌రిపాల‌న‌లో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిది అత్యంత ముఖ్య‌మైన పాత్ర‌. ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రభుత్వ సమీక్షలు నిర్వహించి వాటిని పకడ్బందీగా అమలు చేసేందుకు కింది స్థాయి అధికారులకు సూచనలు - సలహాలు - ఆదేశాలు ప్రధాన కార్యదర్శి ఇస్తారు. త‌ద్వారా ప‌రిపాల‌న స‌క్ర‌మంగా సాగేందుకు కృషి చేస్తారు. అయితే, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌రిపాలనకు సంబంధించి అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. గతంలో పాలనా వ్యవహారాలు పూర్తిగా సీఎస్‌ పరిధిలోనే ఉండగా ఇప్పుడు ప్రస్తుతం అన్ని సీఎం పరిధిలోనే ఉండ‌టంతో సీనియర్ ఐఏఎస్‌ లు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విపై క్రేజ్ చూప‌డం లేదంటున్నారు.

మ‌రోవైపు ఇంకో రూపంలోనూ....ఐఏఎస్‌ లు ఈ ప‌ద‌విపై పెద‌వి విరుస్తున్నార‌ట‌. రిటైర్డ్ అయి కేసీఆర్‌ కు న‌చ్చిన వ్య‌క్తి కాబ‌ట్టి కీల‌క స్థానంలో ఉన్న ఓ అధికారి చెలాయించే పెత్త‌నం కూడా ఐఏఎస్‌ ల‌కు న‌చ్చ‌డం లేద‌ట‌. సీఎస్‌ కు ఉన్న అధికారాలను ప్రశ్నార్ధకం చేసేలా - ప్రభుత్వ ప్రధాన‌ కార్యదర్శి చేసే పనులను కూడా ఆయ‌న‌తో చేయిస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఢిల్లీ వెళ్లినా ఆయన్నే వెంటపెట్టుకుపోతార‌ని - సీఎస్‌ కు సంబంధం లేకుండానే జీవోలు కూడా జారీ చేయిస్తార‌ని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎస్‌ పదవి ఉన్నా లేకున్నా ఒకటే అనే భావనలో సీనియర్‌ ఐఏఎస్‌ లు ఉన్నట్టు సమాచారం.