Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లే: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హాట్‌ కామెంట్స్‌!

By:  Tupaki Desk   |   6 Feb 2023 4:55 PM GMT
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లే: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హాట్‌ కామెంట్స్‌!
X
కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చింతా మోహన్‌ సంచలన వ్యాఖ్యుల చేశారు. ఇంటర్‌ మాత్రమే చదివిన గౌతమ్‌ అదానీకి వేల కోట్ల రూపాయలు రుణమెలా ఇచ్చారని ఎస్‌బీఐని నిలదీశారు. తిరుపతిలోని ఎస్‌బీఐ బ్యాంకు ముందు చింతా మోహన్‌ నిరసనకు దిగారు.

రూ.30 వేల కోట్ల రుణాన్ని ప్రధాని మోదీ స్నేహితుడు అదానీకి రాజకీయ పలుకుబడితో ఎస్‌బీఐ కట్టబెట్టిందని చింతా మోహన్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు గౌతమ్‌ అదానీ కంపెనీల మోసాలు వెలుగులోకి వస్తుండటంతో దేశంలోని 24 వేల బ్రాంచ్‌లు ఉన్న ఎస్‌బీఐ దివాలా తీస్తోందని చెప్పారు. ఇంటర్‌ మాత్రమే చదివిన అదానీనికి ఎలాంటి ష్యూరిటీ లేకుండానే రుణాన్ని ఇచ్చారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానం చెప్పాలని చింతా మోహన్‌ డిమాండ్‌ చేశారు.

ఎస్‌బీఐని... అదానీ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాగా మార్చండి అంటూ చింతా మోహన్‌ ఎద్దేవా చేశారు. అదానీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎల్‌ఐసీని కూడా అదానీ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌గా మార్చాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 20 సీట్లు మాత్రమే వస్తాయని చింతా మోహన్‌ జోస్యం చెప్పారు. బటన్‌ నొక్కినంత మాత్రాన జగన్‌ ను ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు. వైసీపీలో ఉండలేక ఎమ్మెల్యేలే బయటకు వచ్చేస్తున్నారని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా లేరని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్‌ స్పష్టం చేశారు.

చింతా మోహన్‌.. తిరుపతి నుంచి ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. ఇందులో 1984, 1989, 1991ల్లో టీడీపీ తరఫున, 1998, 2004, 2009ల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీగా విజయం సాధించారు.

2014లో రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నేతలు వివిధ పార్టీల్లో చేరిపోయినా చింతా మోహన్‌ మాత్రం పార్టీని వీడలేదు. అయితే తరచూ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.