‘నీ ప్రైవేట్ పార్ట్ ఫొటో పంపించవా’ అమ్మాయి మెసేజ్.. కట్ చేస్తే రచ్చ రచ్చ..!

Mon Feb 22 2021 14:10:57 GMT+0530 (IST)

Send me your private part photo Girl Message To Strange Boy

మ్యాట్రిమోని పేరిట మోసాలు కొత్తకాదు.. అయితే ఇటీవల కొత్తతరహా మోసాలు కూడా వెలుగుచూస్తున్నాయి. మ్యాట్రిమోని డేటింగ్ యాప్ సైట్ల పేరిట కొందరు అమ్మాయిలు డబ్బున్న అబ్బాయిలకు గాలం వేస్తున్నారు. ఆ తర్వాత వాళ్లతో వీడియో కాల్స్ చేసి .. రొమాంటిక్ గా మాట్లాడి రొంపిలోకి దింపుతున్నారు. వీడియో కాల్స్ ను రికార్డ్చేసి మోసాలకు పాల్పడుతున్నారు. కర్ణాటక లోని బెంగళూరులో ఇటువంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.‘అతడో బిజినెస్ మ్యాన్. కోట్ల ఆస్తి ఉంది.  వయసు 33 ఏళ్లు. ఇటీవల పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. ఇందుకోసం ఓ ప్రముఖ మ్యాట్రిమోని సైట్లో తన ప్రొఫైల్ను పెట్టాడు. ఆ ప్రొఫైల్ చూసిన శ్రేయ అనే అమ్మాయి అతడిని ఇష్టపడింది. ఫొటో చూడగానే మనవాడికి కూడా అమ్మాయి తెగ నచ్చేసింది. దీంతో ఇద్దరూ ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. మనసు విప్పి మాట్లాడుకున్నారు. చాలా రోజులు అలాగే సాగుతూ వచ్చింది వీళ్ల వ్యవహారం. ఎటూ పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు కాబట్టి మరింత బోల్డ్ గా కబుర్లు చెప్పుకున్నారు.

వీళ్ల రొమాంటిక్ సంభాషణ ఇలాగే కొనసాగుతుండగా.. ఓ రోజు ఆ అమ్మాయి చిలిపి కోరిక కోరింది. ‘నీ ప్రైవేట్ పార్ట్ చూడాలని నాకు కోరిగ్గా ఉంది’ అని తన మనసులోని మాటను చెప్పింది. ముందతడు తటపటాయించాడు. ఆ అమ్మాయి తన న్యూడ్ పిక్ ను సెండ్ చేసింది. దీంతో టెంప్ట్ అయిన మనోడు తన ప్రైవేట్ పార్ట్ ను పిక్ తీసి పంపించాడు. ఖతం ఆ అమ్మాయి అసలు రంగు బయటపడింది. ‘నువ్వు పంపించిన పిక్ నా దగ్గర సేవ్ అయి ఉంది.. మన వీడియో కాల్ సంభాషణ మొత్తం రికార్డు చేశాను. లక్ష రూపాయలు ఇచ్చావంటే సరేసరే లేదంటే ఈ పిక్స్ వీడియోలు మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను’ అంటూ ఆ అమ్మాయి బెదిరించింది.

దీంతో అతడు షాక్ గురయ్యాడు. తాను అంత ఇచ్చుకోలేనని తొలుత ఫోన్ పే ద్వారా రూ.5000 పంపాడు. ఆ తర్వాత మళ్లీ ఒత్తిడి చేయడంతో మరో రూ.5000 పంపి.. ఆమె నంబర్ బ్లాక్ చేశాడు. అయినా ఆ అమ్మాయి ఇతర నంబర్ల నుంచి కాల్ చేసి వేధిస్తుండటంతో మరో రూ.10000 వేలు సెండ్ చేశాడు. ఇక వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం ఈ కిలేడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.