Begin typing your search above and press return to search.

తెలంగాణలో జులై 1 నుండి స్కూల్స్ ఓపెన్ !

By:  Tupaki Desk   |   1 Jun 2020 8:30 AM GMT
తెలంగాణలో జులై 1 నుండి స్కూల్స్ ఓపెన్  !
X
దేశంలో వైరస్ రోజురోజుకి మరింతగా విజృంభిస్తుంది. లాక్ డౌన్ సడలింపులతో ప్రజా జీవనం కూడా తిరిగి ప్రారంభమయింది. అయితే, లాక్ డౌన్ 4 నేపథ్యంలో ఇచ్చిన సడలింపులు నేపథ్యంలోనే దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి అని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే , కరోనా తో కలిసి జీవించాల్సిందే అని రాష్ట్ర ప్రభుత్వాలు తిరిగి అన్ని పనులని చక్కబెట్టే పనిలో నిమగ్నమైంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ లో బడి గంట త్వరలోనే మోగబోతుంది. జులై 1 నుంచి స్కూల్స్ తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతి లభిస్తే రాష్ట్రంలో వాటిని యథాతథంగా అమలు చేస్తారు. దీనిపై పూర్తివివరాలు చూస్తే .. విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం.. జులై 1 నుంచి తొలుత ఉన్నత పాఠశాలలను ప్రారంభిస్తారు. ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరుస్తారు. ఒక తరగతి గదిలో 15 మంది పిల్లలకు మించి అనుమతించరు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారిని క్లాసులకు అనుమతించరు. ప్లే గ్రౌండ్‌లో ఆటలకు అనుమతించరు. భౌతిక దూరం తప్పనిసరి.

అలాగే, విద్యార్థులు ఎక్కువగా ఉండే ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో షిఫ్ట్ పద్ధతిలో తరగతులు నిర్వహిస్తారు. ప్రాథమిక పాఠశాలలో ఆది, సోమవారాలు సెలవు. రెండో శనివారం సెలవు ఉండదు. ఈ ఒక్క విద్యా సంవత్సరానికి ప్రాథమిక పాఠశాల సిలబస్‌ను 70 శాతానికి తగ్గిస్తారు. అలాగే, మొత్తం పనిదినాలను 150 రోజులకు తగ్గించింది. 8, 9, 10 తరగతుల విద్యార్థుల సంఖ్య 15 మందికి మించితే షిఫ్ట్ విధానంలో తరగతులు నిర్వహిస్తారు. వీరికి మాత్రం ఒక్క ఆదివారం మాత్రమే సెలవు. అలాగే, పదో తరగతి పరీక్షలను ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించాలని విద్యాశాఖ యోచిస్తోంది. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 2020-21 విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకు కుదించింది. అంటే, ఇకపై ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష మాత్రమే.