Begin typing your search above and press return to search.

జుట్లు పట్టుకొని రోడ్డుమీద కొట్టుకున్నారు..: ప్రఖ్యాత స్కూల్ లో అనూహ్య సంఘటన

By:  Tupaki Desk   |   18 May 2022 8:49 AM GMT
జుట్లు పట్టుకొని రోడ్డుమీద కొట్టుకున్నారు..: ప్రఖ్యాత స్కూల్ లో అనూహ్య సంఘటన
X
అమ్మాయిలూ అనగానే.. చాలా సున్నితంగా.. మృదు స్వభావంతో ఉంటారు. చిన్న మాటకే కన్నీళ్లు తెచ్చుకొని ఏడుస్తారు. గట్టిగా మాట్లాడితే తలెత్తుకోకుండా మారం చేరస్తారు. కానీ ఇక్కడి అమ్మాయిలు అలా లేరు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. స్ట్రీట్ రౌడీల్లా కొట్టుకున్నారు. అయితే వీరేదో సాధారణ అమ్మాయిలు కాదు.. విద్యాబుద్ధులు నేర్చుకుంటున్న విద్యార్థినులు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని తమ కలల జీవితం కోసం కష్టపడాల్సిందిపోయి జుట్లు పట్టుకొని లాగేసుకున్నారు. అంతేకాదు... అక్కడే ఉన్న అమ్మాయిల తల్లిదండ్రూ ఇదే రకంగా ప్రవర్తించారు. తమ పరువు పోతుందన్న ఆలోచన లేకుండా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూర్లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.

బెంగుళూర్లోని బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్. ఇందులో చదివిన చాలా మంది పెద్ద పెద్ద పోజిషన్లో ఉన్నారు. దేశంలోనే కాకుండా విదేశాస్లో మంజి పొజిషన్లో స్థిరపడ్డారు. ఈ స్కూల్ లో సీటు వస్తే చాలు తమ బిడ్డల భవిష్యత్ మారిపోతుందని అనుకునే తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అలా చాలా మంది ఇందులో సీటు కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు. ఫైరవీలతో మరీ ఇందులో ఎలాగైనా సీటు తెప్పించుకొని చదువుకున్నారు. అలాంటి స్కూల్ లో ఇద్దరు అమ్మాలు రౌడీల్లాగా కొట్టుకోవడం కలకలం రేపింది.

ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన చిన్న గొడవ పెద్దదిగా మారింది. ముందుగా మాటల యుద్ధంతో సాగి.. ఆ తరువాత కొట్టుకునే స్థాయికి మారింది. సాధారణ రౌడీల్లీ వీరి ప్రవర్తనను చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

కనీసం యూనిఫాం ఉందన్న ధ్యాస లేకుండానే ఒకరి జుట్టును మరొకరు పట్టుకొని లాగేసుకున్నారు. అలా కొట్టుకుంటూ రోడ్డుపైకి వచ్చారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఇలా కొట్టుకోవడం చూసి స్థానికులు షాకయ్యారు. కొందరు తమ చేతిలోని మొబైల్ తో వీడియోలు తీశారు.

ఇదిలా ఉండగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడే ఉన్నట్లు సమాచారం. ఓ విద్యార్థి తల్లి జుట్టును పట్టుకొని మరో విద్యార్థి ప్రవర్తించిన తీరును అక్కడివారిని విస్మయానికి గురిచేసింది.

అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో కాసేపట్లోనే వైరల్ అయింది. మరోవైపు ఈ సంఘటనపై స్కూల్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదని కన్నడ మీడియా తెలిపింది. కానీ వీరిద్దరు ఎందుకు ఇలా కొట్టుకోవాల్సి వచ్చిందని మాత్రం నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.