Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు బెంజ్ కార్లు బోనస్ గా ఇచ్చే యజమాని.. తాజా సంచలనం

By:  Tupaki Desk   |   1 Aug 2021 1:43 PM GMT
ఉద్యోగులకు బెంజ్ కార్లు బోనస్ గా ఇచ్చే యజమాని.. తాజా సంచలనం
X
ఎంతకూ సంపాదించటమే కాని.. తిరిగి ఇచ్చేందుకు మనసు ఒప్పని వ్యాపారస్తులు.. పారిశ్రామిక దిగ్గజాలు చాలామందే ఉంటారు. వీరికి భిన్నంగా తాము సంపాదించిన దాన్లో.. ఉద్యోగులకు ఇస్తూ.. వారిని సంతోషానికి గురి చేస్తూ ఉండే యజమానులు కొందరు ఉంటారు. అయితే.. భారత్ లో ప్రతి దీపావళికి సంచలనంగా మారి.. వార్తల్లోకి ఎక్కే వ్యాపారస్తుల్లో గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారిని అందరికి సుపరిచితం. హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీ యజమాని సావ్జీ ధొలాకియా తన దగ్గర పని చేసే ఉద్యోగులకు.. వారి పని తీరు ఆధారంగా బెంజ్ కార్లను భారీగా అందజేయటం తెలిసిందే. దీపావళి వచ్చిందంటే చాలు.. బోనస్ రూపంలో ఆయన ఉద్యోగులకు ఏం బహుమతిగా ఇస్తారని ఆసక్తిగా ఎదురుచూసే వారు లేకపోలేదు. అలాంటి ఆయన తాజాగా తన కోసం ఆయనో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఉద్యోగులకే బెంజ్ కార్లను బోనస్ గా ఇచ్చే ఆ పెద్ద మనిషి.. తాజాగా ముంబయిలోని ఒక లగ్జరీ ఇంటిని కొనుగోలు చేశారు. ఈ డీల్ విలువ ఇప్పుడు వ్యాపార వర్గాల్లో సంచలనంగా మారింది. ఎందుకంటే.. ఆ భవనం విలువ రూ.185 కోట్లు కావటమే. దీనికి అదనంగా చెల్లించాల్సిన పన్నులు.. రిజిస్ట్రేషన్ ఫీజులు కలిపితే మరింత ఎక్కువ అవుతుంది. ఇంత భారీ మొత్తంతో ఇంటిని కొనుగోలు చేస్తారా? ఇంతకూ ఆ ఇంటి ప్రత్యేకత ఏమిటన్న ప్రశ్నలు మదిలో మెదలక మానవు. ఈ ఇంటిని ఆయన ప్రముఖ సంస్థ ఎస్సార్ గ్రూపు ద్వారా కొనోగుల చేసింది.

ఇంటి తలుపు తెరిచి చూసినంతనే.. సముద్రం కనిపించేలా ఉండే ఈ ప్లేస్ ను చూసినోళ్లు ఎవరైనా సరే ఫిదా కావాల్సిందేనని చెబుతున్నారు. ఈ విలాసవంతమైన భవనం మొత్తం ఆరు అంతస్తుల్లో ఉంటుందని.. చదరపు అడుగు రూ.93 వేల చొప్పున కొనుగోలు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించటం కోసం ఏకంగా రూ.8.3కోట్లు చెల్లించినట్లుగా చెబుతున్నారు.
తన దగ్గర పని చేసే ఉద్య్గోగులకు బెంజ్ కార్లు.. లగ్జరీ విల్లాలు.. ఇలా ఊహించని బహుమతులు ఇస్తూ సర్ ప్రైజ్ చేసే ఆయన.. తాజాగా విలాసవంతమైన భవంతిని కొనుగోలు చేసిన వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారారు. సంపాదించింది అంతా దాచేయకుండా.. ఇచ్చేది ఇస్తూ ఉంటే.. ఇలానే తిరిగి మరింత ఇస్తాడన్నట్లుగా ఉంటుంది ఈ వజ్రాల వ్యాపారి ఉదంతం చూస్తే.