Begin typing your search above and press return to search.

బాబు చేతికి కట్టు... సెటైర్లే సెటైర్లు

By:  Tupaki Desk   |   14 Aug 2019 4:59 AM GMT
బాబు చేతికి కట్టు... సెటైర్లే సెటైర్లు
X
టీడీపీ అధినేత - ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు వ్యవహార సరళిపై ఇప్పుడు అటు సోషల్ మీడియాతో పాటు ఇటు రచ్చబండ చర్చల్లోనూ సెటైర్ల మీద సెటైర్లు పేలుతున్నాయి. ఏజ్ బార్ అయినా చంద్రబాబు హెల్త్ పరంగా ఫిట్టేనని చెప్పాలి. తనకున్న చర్మ వ్యాధి మినహా మిగిలిన ఓ వ్యాధినీ దగ్గరకు రానీయకుండా చంద్రబాబు పాటిస్తున్న డైట్ ను చూస్తే నిజంగానే ముచ్చటేయక మానదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు చేతికి కట్టుతో కనిపించేసరికి అంతా షాక్ తిన్నారనే చెప్పాలి. ఈ షాక్ లో నుంచే చాలా మంది ఆయన తీరుపై తమదైన శైలి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. చేతికి కట్టుతొో పాటు ఇప్పుడు చంద్రబాబు తన మకాంను ఉండవల్లి పరిధిలో కరకట్టపై ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ ను వదిలి హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. ఈ షిఫ్ట్ తాత్కాలికమే అయినా... సరిగ్గా ఇప్పుడే ఆయన హైదరాబాద్ కు మకాం మార్చడం వెనుక అసలు కారణమిదేనంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థులు విరుచుకుపడుతున్నారు. మొత్తంగా ఇప్పుడు చంద్రబాబు తన చేతికి కట్టుతో పాటు హైదరాబాద్ కు మకాం మార్చిన వైనంపై జోకులు పేలుతున్నాయి.

అయినా చంద్రబాబు చేతికి ఏమైందన్న విషయానికి వస్తే... మొన్న చేతి మణికట్టు బెణకడంతో వైద్యులు ఆ చేతికి కట్టు కట్టారట. అది కట్టు కాదు గాని చేతి కండరాలను పట్టి ఉంచే పట్టీ లాంటిదే. దీనిపై నెటిజన్లేమో... మొన్నటిదాకా సీఎం కుర్చీలో ఉన్న చంద్రబాబు రాత్రింబవళ్లు పనిచేసి సంతకాలపై సంతకాలు పెట్టేశారు కదా. ఇప్పుడు విపక్ష నేతగా మారిన తర్వాత ఆ పనే లేకపాయే. ఇక నిత్యం సంతకాలు పెట్టిన చేయి... ఇప్పుడు ఖాళీగా ఉండే సరికి పట్టేయదా? అంటూ తమదైన శైలి సెటైర్లు సంధిస్తున్నారు. రచ్చబండల మీదా ఇదే తరహా చర్చ సాగుతోంది. ఇక సరిగ్గా కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడే చంద్రబాబు కరకట్ట బంగ్లాను వదిలేసి హైదరాబాద్ పారిపోయారంటూ వైసీపికి చెందిన కీలక నేత - ఆ పార్టీ ఎంపీ వల్లభనేని బాలశౌరి తనదైన శైలి సెటైర్ ను బాబుపైకి సంధించారు.

ఏపీకి సీఎంగా ఉండి కూడా అమరావతిలో సొంత ఇల్లు కట్టుకోకుండా...పారిపోయి వచ్చిన హైదరాబాద్ లోనే వందల కోట్లు పెట్టి కొత్త ఇంటిని నిర్మించుకున్న తీరుపై ఇప్పటికే బాబుపై విమర్శలు రేగుతుంటే... తాజాగా సరిగ్గా వరదలు వచ్చినప్పుడు బాబు హైదరాబాద్ కు వెళ్లిపోవడంపై నిజంగానే వ్యంగ్యస్త్రాలు వచ్చి పడటం సహజమే కదా. వరద ఉధృతితో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ఎక్కడ తనను ముంచేస్తుందోనన్న భయంతోనే చంద్రబాబు హైదరాబాద్ పారిపోయారని బాలశౌరి టైమ్లీ సెటైర్ సంధించారు. నిజమే మరి... కరకట్లపై నిబంధనలకు విరుద్ధంగానే లింగమనేని గెస్ట్ హౌస్ కట్టారన్న ఆరోపణలు ఉన్నాయి కదా. మరి వరద పోటెత్తితే... దానిలోకి వరద నీరు వస్తే... పరిస్థిాతి ఏంటి? ఈ లెక్కన ఆలోచించే బాబు హైదరాబాద్ బాట పట్టారన్నది బాలశౌరి వాదన. ఏమో మరి... ఈ వ్యంగ్యాస్రాలకు బాబు శిబిరం నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయో చూడాలి.