బాబు ఓటమిని పండుగ చేసుకుంటున్నారు..

Fri May 24 2019 20:00:01 GMT+0530 (IST)

Satires on Chandrababu Naidu Over TDP Defeat

ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం.. 9 నెలల్లోనే అధికారం చేపట్టిన ఎన్టీఆర్ ను కూడా ఓడించి ఐదేళ్లు అధికారంలోకి దూరంగా ప్రతిపక్షంలో కూర్చుండబెట్టారు జనాలు. ఓటమితోనే ఎన్టీఆర్ చరిత్ర మరుగున పడిపోలేదు. గొప్పనాయకుడి స్టామినా తగ్గిపోలేదు. ఆయన పథకాలు గొప్పతనం నేటికి చిరస్థాయిగా ఉంది.ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి కూడా అంతే.. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ సార్లు సీఎంగా గద్దెనెక్కిన చంద్రబాబు.. విజాజిత నవ్యాంధ్ర తొలి సీఎంగా గెలిచారు. అమరావతి అంటూ అద్భుత నిర్మాణమంటూ.. పోలవరం అంటూ చంద్రబాబు తన పాలన తాను చేసుకున్నాడు. కానీ ఈ ఐదేళ్లలో బాబు చేతిలో దగాపడ్డ వారు.. నమ్మించి మోసం చేసిన వారికి ఇప్పుడు పండుగలా ఉంది. బాబు ఓటమిని వారు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

చంద్రబాబు దారుణ పరాజయాన్ని తాజాగా టీడీపీ మాజీ నేత - సీనియర్ పొలిటీషయన్ అయిన మోత్కుపల్లి పండుగ చేసుకుంటున్నారు. ఆయనపై దారుణ పదునైన విమర్శలు చేశారు. తనకు గవర్నర్ - రాజ్యసభ సీట్లు ఇస్తానని హామీ ఇచ్చారని.. అనంతరం మోసం చేసి వంద కోట్లకు ఒకటి చొప్పున అమ్ముకున్నారని దుమ్మెత్తిపోశారు. చంద్రబాబు ఏపీలో ఓడిపోయి అంతరించిపోయినందుకు సంతోషంగా ఉందన్నారు. ఏపీలో జగన్ గెలుపు తనకు ఆనందాన్ని సంతోషాన్నిచ్చిందన్నారు. ఎన్టీఆర్ మనోవాంఛ ఇప్పుడు నెరవేరిందన్నారు.

ఇలా చంద్రబాబు ఓటమిపై తొలిసారి ఆ పార్టీ మాజీ నేత అయిన మోత్కుపల్లి హర్షించడం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇదివరకే మోహన్ బాబు - రాంగోపాల్ వర్మ వాళ్లు వ్యతిరేకించినా వాళ్లంతా వైసీపీ సానుభూతి పరులు..పార్టీ నేతలు.. కానీ బాబు చేతిలో మోసపోయిన ఇలాంటి టీడీపీ మాజీ నేతలు తొలిసారి బాబుకు సరైన శాస్తి జరిగిందని విమర్శించడం రాజకీయంగా సంచలనంగా మారింది.