Begin typing your search above and press return to search.

జైలు నుంచి రిలీజ్ కావాల్సిన వేళలో.. చిన్నమ్మకు కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   22 Jan 2021 4:04 AM GMT
జైలు నుంచి రిలీజ్ కావాల్సిన వేళలో.. చిన్నమ్మకు కరోనా పాజిటివ్
X
ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలి.. జైలుశిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ నేత శశికళ అలియాస్ చిన్నమ్మకు కరోనా పాజిటివ్ గా తేలింది. కొద్ది నెలల్లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్ని తీవ్ర ప్రభావానికి గురి చేసే శక్తి చిన్నమ్మ సొంతమని.. ఆమె జైలు నుంచి విడుదలైన వెంటనే పలు రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయన్న చర్చ జరుగుతున్న వేళలో ఆమెకు పాజిటివ్ గా తేలటం షాకింగ్ గా మారింది.

తాజాగా ఆమెను జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ.. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 27న విడుదల కావాల్సి ఉంది. ఆమెకు జైలు నుంచి స్వాగతం పలికేందుకు వెయ్యి కార్లతో భారీ ఊరేగింపుతో తమిళనాడు తీసుకెళ్లాలని ఆమె మద్దతుదారులు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటివేళలో ఆమె జ్వరం.. వెన్నునొప్పి.. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది పడుతుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు.

అందులో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో.. ఆమెను స్థానిక లేడీ క్యూర్ జోన్ ఆసుపత్రిలో చేర్చారు. తొలుత ఆర్టీజెన్ పరీక్ష నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. అనంతరం ఆర్టీపీసీఆర్ పరీక్షలో మాత్రం పాజిటివ్ గా తేలింది. దీంతో ఆసుపత్రికి తరలించారు. తమ నాయకురాలు త్వరలోనే జైలు నుంచి బయటకు వస్తారని ఆశగా ఎదురుచూస్తున్న మద్దతుదారులకు కరోనా భారీగా దెబ్బేసింది. ఇప్పుడామె ఆరోగ్యం మెరుగుపడాలని.. వెంటనే కోలుకోవాలని కోరుకుంటున్నారు.