Begin typing your search above and press return to search.

సార్కో.. నొప్పిలేకుండా మనుషుల ప్రాణాలు తీస్తుంది..!!

By:  Tupaki Desk   |   8 Dec 2021 6:30 AM GMT
సార్కో.. నొప్పిలేకుండా మనుషుల ప్రాణాలు తీస్తుంది..!!
X
నయం లేని రోగాలతో బాధపడుతున్న వారు.. ఈ నరకం కంటే చావే మేలని అనుకుంటారు. కానీ చావు అంతకంటే భయంకరంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు.. దీంతో ఎలా చనిపోవాలి..? అన్న సందేహం ఉంటుది. అయితే కొందరు ఆనందంగా మరణించాలని కోరుకుంటారు. జీవితంలో తాము తట్టుకోలేని బాధల నుంచి విముక్తి పొందాలనుకువారు తమ ప్రాణాలను తీయాలని ఇతరులను కోరుకుంటారు.

అలాంటి వారి ప్రాణాలు తీయడానికి అధికారంగా ఎవరికీ హక్కు లేదు. కానీ స్విట్జర్లాండ్ ప్రభుత్వం మాత్రం ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. నొప్పిలేకుండి నిమిషం వ్యవధిలో మనిషిని చంపే యంత్రాన్ని కనిపెట్టడంతో దానిని చట్టబద్ధం చేసింది. దీంతో కళ్లు తప్ప మిగతా అవయవాలు పనిచేయని వారు ఎలాంటి బాధ లేకుండా చనిపోవచ్చు.

సార్కో అనే పేరుగల ఈ మరణ యంత్రాన్ని తయారు చేయడంలో డాక్టర్ ఫిలిప్ నిట్ష్కే కీలక పాత్ర పోషించారు. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కు డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఫిలిప్. హైపోక్సియా, హైపోకాప్నియా ద్వారా ఈ మెషిన్ మనుషులను చంపుతుంది. ఇందులోకి వెళ్లిన వారిలో కణజాల స్థాయిలో ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది.

రక్తంలో కార్బన్ డయాక్సైడ్ ను తగ్గిస్తుంది. దీంతో వ్యక్తి కళ్లు తెరిచే ఉంటూ మరణిస్తారు. బ్రెయిన్ డెడ్, ఇతర నయంలేని రోగాలతో బాధపడుతున్న వారు ఇలాంటి మిషన్లలోకి వెళ్లిన తరువాత ఎలాంటి కదలికలు లేకుండా చనిపోతారు. ఈ ప్రక్రియంతా కేవలం నిమిషంలోనూ పూర్తవుతుంది.

ఇక మిషన్ లోపల ఉండే వ్యక్తి ఏదైనా చెప్పాలనుకుంటే తాను కనరెప్పలతో మాత్రమే సైగలు చేయొచ్చని తెలుపుతున్నారు. కాగా ఈ యంత్రాన్ని కావాలనుకున్నవారు తమకు నచ్చిన ప్రదేశంలోకి తీసుకెళ్లవచ్చు. అచ్చం శవపేటికలా ఉండే ఇది బయోడిగ్రేడముల్ క్యాప్సూల్ బేస్ నుంచి విడిపోతుంది. సాధారణంగా తగ్గని రోగాలతో బాధపడేవారు ఎక్కువగా మరణాన్ని కోరుకుంటారు.

తాము ఈ బాధ భరించేకన్నా చనిపోతేనే హాయిగా ఉంటుందని కొందరు భావిస్తారు. అయితే ఇలాంటి వారికి స్విట్జర్లాండ్ ప్రభుత్వం అసిస్టెడ్ డైయింగ్ కోసం డాక్టర్లను ఒప్పించి లిక్విడ్ సోడియం పెంటో బార్బిటల్ ఇవ్వాలని సూచిస్తోంది. అయితే ఇది కష్టమైన పని దీనిని ఇవ్వాలంటే ఇంజెక్షన్ ద్వారా పంపించాలి. కానీ తాజాగా మిషన్ ద్వారా ఒక్క సూది కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదని తయారీదారులు పేర్కొంటున్నారు.

అన్నీ కలిసొస్తే వచ్చే ఏడాది నుంచి సార్కో ను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని డాక్టర్ ఫిలిప్ అన్నారు. ఇది చాలా ఖరీదైన ప్రాజెక్టు అని, దీని అమలు కోసం ప్రయత్నిస్తున్నామని అయన పేర్కొన్నారు. అయితే ఇలాంటి మిషన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఫిలిప్ తయారు చేసిన సార్కో ను ఉపయోగించే పద్ధతిపై తప్పు పడుతున్నారు.

ఆత్మహత్యను కూడా అందంగా చెబుతున్నారని అంటున్నారు. ప్రస్తుతం సార్కో ప్రొటోటైప్ లు రెండు మాత్రమే ఉన్నాయని, త్వరలో మరొకటి తయారు చేస్తున్నామని డాక్టర్ తెలిపారు.

స్విట్జర్లాండ్ లో అసిస్టెడ్ సూసైట్ చట్టబద్ధంగా ఉంది. గత సంవత్సరంలో 1300 మంది మెర్సీ కిల్లి సంస్థల సేవలను ఉపయోగించుకున్నారు. ఇక సార్కో అందుబాటులోకి వస్తే ప్రభుత్వం ఏవిధంగా వాడుకుంటుందోనని చర్చించుకుంటున్నారు.

పక్షవాతం వల్ల కనురెప్పలు తప్ప మిగతా అవయవాలేవీ పనిచేయని సమయంలో కొందరు తమ చావును కోరుకుంటున్న నేపథ్యంలో సార్క్ లోకి పంపించవచ్చని అంటున్నారు. యంత్రాన్ని ఉపయోగించే వ్యక్తి లాక్ ఇన్ సిండ్రోమ్ తో బాధపడుతుంటే ఆయన రెప్ప వేయడం ద్వారా ప్రక్రియను మొదలు పెడుతారు. దీంతో ప్రభుత్వం అనుమతితో నచ్చిన చోట చనిపోవచ్చని కొందరు అంటున్నారు.