Begin typing your search above and press return to search.

ట్విట్టర్ తో నాకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది: ప్రముఖ క్రికెటర్

By:  Tupaki Desk   |   20 Jun 2021 3:57 AM GMT
ట్విట్టర్ తో నాకు మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది: ప్రముఖ క్రికెటర్
X
ట్విటర్ వల్ల తనకు లాభం కన్నా.. నష్టమే ఎక్కువగా జరిగిందని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వాపోయాడు. సోషల్ మీడియాను తాను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నానని అన్నాడు. అందరూ ఇష్టపడేలా ట్వీట్లుఎలా చేయాలో ఇప్పటికీ తనకు అర్థం అవ్వట్లేదని మంజ్రేకర్ అంటున్నాడు.

క్రికెట్ కామెంటరీలో దిట్టగా పేరొందిన సంజయ్ మంజ్రేకర్ చేస్తున్న కామెంట్లు వివాదాస్పదమవుతున్నాయి. నిత్యం ఏదో క్రికెటర్ పై నోరు పారేసుకోవడం ఆయనకు అలవాటుగా మారిందన్న విమర్శ ఉంది. నిన్నటికి రవీంద్రజడేజాపై తీవ్ర విమర్శ చేశాడు. అతడికి నోటి దురుసు ఎక్కువ అని అంటుంటారు.

ఇక ప్రముఖ కామెంటేటర్ ‘హర్ష భోగ్లే’ను అవమానిస్తూ మాట్లాడడం కూడా వివాదాస్పదం అయ్యింది. దీంతో కొన్నాళ్లు వ్యాఖ్యానం చేయకుండా బీసీసీఐ నిషేధించింది. అయినా మంజ్రేకర్ లో ఎలాంటి మార్పు రాలేదు.

ఇటీవల తన ఆల్ టైం గ్రేట్ పుస్తకంలో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇంకా చోటు దక్కించుకోలేదని ట్వీట్ చేశాడు. దానిపైనా పెద్ద దుమారం రేగింది. మాజీలు అందరూ మంజ్రేకర్ పై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో మంజ్రేకర్ ను పలు టీవీ చానెళ్లు కామెంటరీకి దూరం పెట్టాయి. దీంతో మంజ్రేకర్ తాజాగా స్పందించారు. సోషల్ మీడియా తనకు చేటు తెచ్చిందని.. ఆ కామెంట్లు ఎలా చేయాలో తెలియక విమర్శల పాలవుతున్నానని తెలిపాడు. ట్విట్టర్ రెండు వైపులా పదునైన కత్తి అని.. కొన్ని సందర్భాల్లో నాకు మంచి చేస్తే.. ఎక్కువ సార్లు చెడు చేసిందని వివరించాడు. సమతూకం కోసం ప్రయత్నించినా నాకు నష్టాన్నే ఎక్కువ కలిగించిందన్నారు. సోషల్ మీడియా ఒక మృగంలా అనిపిస్తోందన్నాడు. దానిని అర్థం చేసుకోలేకపోతున్నానన్నారు.

ఇప్పటికీ తనకు సోషల్ మీడియాలో పోస్టులు ఎలా పెట్టాలో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా.. అందరూ ఇష్టపడేలా ఎలా చేయాలో మరి అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు.