Begin typing your search above and press return to search.

ధోనీలో ఎంతో కసిఉంది.. కానీ టైం కలిసిరాలేదు..! సంగక్కర

By:  Tupaki Desk   |   31 Oct 2020 11:50 AM GMT
ధోనీలో ఎంతో కసిఉంది.. కానీ టైం కలిసిరాలేదు..!  సంగక్కర
X
ఐపీఎల్ 2020 సీజన్‌లో సీఎస్​కే కెప్టెన్​ మహేంద్ర సింగ్ ధోనీ దారుణంగా విఫలమయ్యారు. వరుస ఓటములతో చెన్నై ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పకున్నది. ఈ ఐపీఎల్​లో మహేంద్రసింగ్ ధోనీ కూడా పెద్దగా రాణించలేకపోయాడు. కీపింగ్‌లో మెరుగైన ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలయ్యాడు. కెప్టెన్సీలో కూడా మునపటిలా రాణించలేకపోయాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా చెన్నై ఘోరంగా ఓటమి పాలైంది. కనీసం ఐపీఎల్ 2021 సీజన్‌‌కైనా ధోనీ ప్రిపెరై రావాలని శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర సూచించాడు. స్టార్ స్పోర్ట్స్ చానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. వచ్చే సీజన్ ముందు ధోనీ కాంపిటీటివ్ క్రికెట్ ఆడి తన ఫామ్ అందుకోవాలని సలహా ఇచ్చాడు.

‘వ్యక్తిగత ప్రదర్శన పట్ల ధోనీ తీవ్ర నిరాశకు గురై ఉంటాడు. అయితే మిగిలిన ఒక్క మ్యాచ్‌తో అతనేం చేయలేడు. కనీసం వచ్చే సీజన్‌ కైనా గట్టిగా ప్రిపేటర్​ అయి రావాలి. అంతర్జాతీయ క్రికెట్‌, ఫస్ట్ క్లాస్, ప్రాంతీయ క్రికెట్ ఆడకుండా నేరుగా ఐపీఎల్‌లో ఆడుదామంటే కుదరదు. ఫామ్ అందుకోవాలంటే అతను వచ్చే సీజన్ ముందు కాంపిటీటివ్ క్రికెట్ ఆడాలి.' అని ఈ శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సూచించాడు. ఇక ధోనీ మంచి క్రికెట్ ఆడాలనే ఆకలితో ఉన్నాడని సంగక్కర చెప్పుకొచ్చాడు. అదే అతన్ని మెరుగయ్యేలా చేస్తుందని అభిప్రాయపడ్డాడు. ‘ధోనీ మంచి క్రికెట్ ఆడాలనే ఆకలితో ఉన్నాడని కచ్చితంగా చెప్పగలను. ధోనీ ఓ బెస్ట్​ క్రికెటర్​. అతడు తన వ్యక్తిగత స్కోర్​ పెంచుకోవడం మీద, రికార్డుల మీద దృష్టి పెట్టడు. కేవలం జట్టు విజయం కోసం మాత్రమే పనిచేస్తాడు. అంత కమిట్​మెంట్ ఉన్న క్రికెటర్​ను నేను ఇంతవరకు చూడలేదు. ఏ ఆటగాడికైనా చెడ్డ రోజులు కూడా ఉంటాయి. అలాగే ధోనీకి కూడా ఇప్పుడు బ్యాడ్ టైం నడుస్తోంది’ అని సంగక్కర అభిప్రాయపడ్డాడు.