వైసీపీకి ‘సంచయిత’ జలక్?

Sat Aug 08 2020 13:40:37 GMT+0530 (IST)

Sanchayita Gajapati Raju Gave Shock To Ysrcp

విజయనగరం రాజుల వారాసురాలైన ఆనంద్ గజపతి రాజు కూతురు సంచయితకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. జగన్ అధికారం చేపట్టాక ఆమె బాబాయి టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు చెక్ పెట్టి వారి సామ్రాజ్యంలో ఉన్న పాలనను సంచయితకు ఇప్పించారు.విజయనగరం పూసపాటి రాజుల కోటలో సంచయిత రాకతో రచ్చ మొదలైంది. వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కాక ఇన్నాళ్లు ఆ రాజులకు చెందిన మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న అశోక్ గజపతి రాజును సాగనంపింది. ఇది వివాదమైంది.

టీడీపీలో అందరికంటే సీనియర్ నేత వయసులో పెద్దాయన మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతికి ఈ షాక్ తో కోర్టుకు ఎక్కారు. తననే వారసుడిగా చేయాలని కోరారు. ఆ కేసు నడుస్తోంది.

అశోక్ గజపతి రాజు మాన్సన్ ట్రస్ట్ చైర్మన్  పదవిని వైసీపీ ప్రభుత్వం వచ్చాక  తొలగించింది. ట్రస్ట్ చైర్మన్ గా ఆయన కుటుంబానికే చెందిన వైసీపీ నేత ఆనంద గజపతిరాజు కుమార్తె సంచిత గజపతిరాజును నియమించింది.అయితే సంచయిత బీజేపీలో ఉన్న కూడా వైసీపీ ప్రభుత్వం అశోక్ గజపతికి వ్యతిరేకులు కావడంతో పదవిని కట్టబెట్టింది.

ఆ కోవలోనే సింహాచలం ఆలయ చైర్మన్ గా సంచిత ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మాన్సన్ ట్రస్ట్ చైర్మన్ గా సంచిత ప్రమాణ స్వీకారం చేశారు.  సంచిత గజపతిరాజు నిర్వహించే మాన్సన్ ట్రస్ట్ కు 108 ఎకరాలు 14800 ఎకరాల భూములున్నాయి. దేవాలయాల నిర్వహణ చూసే ఈ అతిపెద్ద ట్రస్ట్ అశోక్ గజపతి చేతుల మీద నుంచి మారిపోయింది.

అయితే రాబోయే ఎన్నికల్లో విజయనగరం ఎంపీగా సంచయితను నిలబెట్టాలని వైసీపీ అధిష్టానం చూస్తే ఆమె నేను ఇప్పటికీ బీజేపీ నే అని వైసీపీకి జలక్ ఇచ్చే పరిస్థితి వచ్చిందని ఆ జిల్లాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం ఇంత పెద్ద ఆఫర్ ఇచ్చినా ఆమె బీజేపీనే పట్టుకొని వేలాడడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.