Begin typing your search above and press return to search.

శాంసంగ్ కూడా చైనాకు షాకిచ్చింది

By:  Tupaki Desk   |   1 Aug 2020 4:10 PM GMT
శాంసంగ్ కూడా చైనాకు షాకిచ్చింది
X
గత ఏడాది చైనాలో తన చివరి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీని మూసివేసిన శామ్‌సంగ్ తాజాగా తన చివరి కంప్యూటర్/ల్యాప్ టాప్ ఉత్పత్తిని ఆపేసింది. ఈ మేరకు కంపెనీ ఉద్యోగులకు నోటీసులు ఇచ్చింది దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో. ఈ పరిణామం ఇటీవల చైనాకు తగులుతున్న వరుస దెబ్బల్లో తాజా దెబ్బ. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా నుంచి తన ఉత్పత్తిని మార్చిన మరో పెద్ద కంపెనీ అనే కోణంలో ఈ పరిణామాన్ని వర్ణించవచ్చు. ఇప్పటికే అనేక కంపెనీలు చైనాలో తమ కంపెనీలను మూసివేస్తూ వచ్చాయి.

చైనాలో ఏ కారణంతో ఉత్పత్తి కేంద్రాన్ని శాంసంగ్ మొదలుపెట్టిందో... ఆ ప్రయోజనాలు, ఫలితాలు ఇపుడు దక్కకపోవడంతో పాటు అనేక అంతర్జాతీయ పరిణామాలు ఈ మూసివేతకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. పెరుగుతున్న చైనా కార్మిక వ్యయాలు, యు.ఎస్-చైనా వాణిజ్య యుద్ధం, కోవిడ్ -19 వల్ల తగిలిన దెబ్బలతో అనేక కంపెనీలు తమ ఉత్పత్తి, సరఫరా కార్యాకలాపాలపై పునరాలోచనలో ఉన్నాయి. ఆ క్రమంలో వెలువడిన నిర్ణయం ఇది.

శాంసంగ్ తాజాగా మూసివేసిన ఈ కంపెనీలో ఉన్న 1,700 మంది ఉద్యోగాలు పోయాయి. పరిశోధన మరియు అభివృద్ధి విభాగాన్ని మాత్రం చైనాలో కొనసాగిస్తున్న శాంసంగ్ తెలిపింది. తీసివేస్తున్న ఉద్యోగులకు ఈ పాటికే నోటీసులు అందాయి. ఇదిలా ఉండగా... ఈ కర్మాగారం 2012 లో 4.3 బిలియన్ డాలర్ల విలువకు సమానమైన వస్తువులను ఎగుమతి చేసింది. ఆ తర్వాత ఇది క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2018 నాటికి దారుణంగా ఒక బిలియన్ డాలర్లకు పడిపోయింది. కంపెనీ మూత గురించిన ఒక ప్రెస్ నోట్ తప్ప శాంసంగ్ ఎటువంటి వివరాలను వెల్లడించలేదు.