Begin typing your search above and press return to search.

మహా మంత్రి అల్లుడికి 9 నెలలు జైలు తర్వాతే బెయిల్.. మరి ఆర్యన్?

By:  Tupaki Desk   |   15 Oct 2021 11:30 AM GMT
మహా మంత్రి అల్లుడికి 9 నెలలు జైలు తర్వాతే బెయిల్.. మరి ఆర్యన్?
X
మామూలు కేసుల్లో కాస్త అటు ఇటు ఉండొచ్చేమో కానీ.. డ్రగ్స్ కేసుల్లో బుక్ అయిన ప్రముఖులకు ఒక పట్టాన బెయిల్ రాకపోవటం తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ను క్రూయిజ్ లో అదుపులోకి తీసుకోవటం.. అతని వద్ద నుంచి నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జైల్లో ఉన్న అతను.. బెయిల్ కోసం షారుక్ విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ ఆయనకు ఎప్పటికప్పుడు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి బెయిల్ కోసం ప్రయత్నించటం.. ఇరు వర్గాల వాదన విన్న కోర్టు.. తీర్పును రిజర్వు చేసి.. ఈ నెల20న తీర్పు వెలువరిస్తామని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్ర మంత్రి ఎన్ సీపీ నేత నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ గత జనవరిలో డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యారు. పలు ప్రాంతాల్లో తనిఖీల్ని నిర్వహించిన మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ.. ఈ కేసుతో సంబంధం ఉన్న సమీర్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. కట్ చేస్తే.. అప్పటి నుంచి పలుసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవటం.. కోర్టు రిజెక్టు చేస్తున్న పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తొమ్మిది నెలల ప్రయాస అనంతరం ముంబయి కోర్టు తాజాగా సమీర్ ఖాన్ కు బెయిల్ మంజూరు చేసింది. అధికారపక్షంలో భాగస్వామి.. రాష్ట్ర మంత్రి అల్లుడైన వారికే బెయిల్ మంజూరుకు తొమ్మిది నెలలు పట్టిన వేళ.. షారుక్ కుమారుడు ఆర్యన్ సంగతేంటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మిగిలిన కేసుల సంగతి ఎలా ఉన్నా.. డ్రగ్స్ ఆరోపణల కేసుల్లో మాత్రం తొందరపడి బెయిల్ ఇవ్వకూడదన్నట్లుగా కోర్టులు వ్యవహరిస్తున్నట్లుగా చెబుతున్నారు. డ్రగ్స్ నేరంతో పట్టుబడిన వెంటనే బెయిల్ మంజూరు చేస్తే.. మరింత అవకాశం ఇచ్చినట్లు అవుతుందని.. అందుకే ఈ కేసు కింద బుక్ అయిన వారికి త్వరగా బెయిల్ రావట్లేదన్న మాట వినిపిస్తోంది. అదే జరిగితే.. షారుక్ కుమారుడు ఆర్యన్ మరింత కాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని చెబుతున్నారు. తొమ్మిది నెలల జైలు జీవితం తర్వాతే మహామంత్రి అల్లుడికి బెయిల్ లభించటం దీనికో నిదర్శనమన్న మాట వినిపిస్తోంది.