Begin typing your search above and press return to search.

త్రిభాషా సూత్రాన్ని అమలు చేయం : సీఎం పళనిస్వామి

By:  Tupaki Desk   |   3 Aug 2020 10:30 AM GMT
త్రిభాషా సూత్రాన్ని అమలు చేయం : సీఎం పళనిస్వామి
X
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జాతీయ విద్యావిధానం వల్ల తమిళనాడు లో మరో ఉద్యమం మొదలైయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తమిళ వాసులు రాష్ట్ర భాష పై ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఇది అందరికి తెలిసిన విషయమే. పార్టీలు వేరు అయినా కూడా భాష పై మాత్రం ఒకటే మార్గం లో నడుస్తారు తమిళ నాయకులు. అయితే , కేంద్రం తాజాగా తీసుకొచ్చిన జాతీయ విద్యావిధానంతో ఆలోచనలో పడ్డ తమిళనాడు ప్రభుత్వం .. తమిళ భాషకు వ్యతిరేకంగా ఉన్న జాతీయ విద్యావిధానంను రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయము అని సీఎం పళనిస్వామి ప్రకటించారు.

ముఖ్యకారణం ఏమిటి అంటే .. కేంద్రం కొత్తగా తీసుకు వచ్చిన ఈ త్రిభాషా సూత్రాన్ని తమిళనాడులో అధికార అన్నాడీఎంకే తో పాటు బీజేపీ యేతర విపక్ష పార్టీలన్నీ వ్యతిరేకిస్తున్నాయి. త్రిభాషా సిద్ధాంతం విషయం లో తమిళనాడు లో గత ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత అనుసరించిన వైఖరినే తామూ అనుసరిస్తామని సీఎం పళనిస్వామి తెలిపారు. త్రిభాషా సిద్ధాంతం అమలుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని సీఎం ప్రధాని మోడీని కోరారు. తమ రాష్ట్రంపై హిందీ భాషను కావాలనే రుద్దడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని, ఈ నేపథ్యంలో 1965 లో హిందీకి వ్యతిరేకం గా తమిళనాడు లో విద్యార్థి సంఘాలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించిన విషయాన్ని ఈ పార్టీలు గుర్తు చేశాయి. గతంలో డీఎంకె నేతృత్వం లో కూడా చిన్న చిన్న పార్టీలు కూడా హిందీ భాషను తమ రాష్ట్రంపై రరుద్దే ప్రయత్నం చేస్తే . దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని కేంద్రాన్ని హెచ్ఛరించాయి.

ఈ త్రిభాషా సూత్రం పై తమిళ సర్కార్ ఆందోళన చేస్తున్న సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ రియాక్ట్ అయ్యారు. కేంద్రం ఏ భాషనూ రాష్ట్రాలపై రుద్దబోదని హామీ ఇస్తూ , ఈ విషయంలో మాజీ కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ సూచనలు తీసుకునేందుకు సిద్దమని, అలాగే ఎవరు ఆందోలన చెందాల్సిన అవసరం లేదు అని తెలిపారు.