Begin typing your search above and press return to search.

‘ఆస్ట్రేలియా టూర్’ తొలిసారి స్పందించిన సచిన్​..! ​

By:  Tupaki Desk   |   26 Nov 2020 4:00 AM GMT
‘ఆస్ట్రేలియా టూర్’ తొలిసారి స్పందించిన సచిన్​..! ​
X
ఆస్ట్రేలియా టూర్​కు బీసీసీఐ జట్టు ఎంపికచేసినప్పటి నుంచి సీనియర్​ క్రికెటర్లు, క్రికెట్​ అభిమానుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై ఇండియన్స్​ తరఫున ఆడి అద్భుతంగా రాణించిన సూర్య కుమార్​ యాదవ్​ ను పక్కన పెట్టడం.. ఫిట్ ​నెస్​ వంకతో రోహిత్​ శర్మను ఎంపిక చేయక పోవడంపై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఓ దశలో రోహిత్ శర్మను కెప్టెన్​ చేయాలన్న వాదన బలంగా వినిపించింది. సీనియర్​ క్రికెటర్​ గౌతమ్​ గంభీర్​ పలుమార్లు బీసీసీఐ తీరును తప్పుపట్టారు.

రోహిత్​ను టీ20కి కెప్టెన్​ చేయాలని ఆయన అవకాశం వచ్చిన ప్రతిసారి తన వాయిస్​ను వినిపిస్తున్నారు. సంజయ్​ మంజ్రేకర్ లాంటి సీనియర్లు కూడా టీంఇండియా కూర్పును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలో ఈ వివాదం పై ఒక్కసారి కూడా స్పందించని సచిన్​ తాజాగా ఓ కామెంట్​ చేశాడు. టెస్టుల్లో మయాంక్​ను ఓపెనర్ ​గా తీసుకోవడం మంచి నిర్ణయమని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు ఐపీఎల్​ మంచి ప్రదర్శన ఇచ్చిన క్రికెటర్లను బీసీసీఐ ఎప్పటికీ పక్కనపెట్టదని.. వాళ్లకు కచ్చితంగా అవకాశం ఇస్తుందని కూడా సచిన్​ అన్నాడు.

ప్రస్తుతం టీం ఇండియా ఆస్ట్రేలియా టూర్​ లో ఉన్న విషయం తెలిసిందే. మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల్లో ఆడనున్నది. కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదటి టెస్ట్ తర్వాత భారత్ తిరిగి వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సచిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. టెస్టుల్లో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ కరెక్ట్ ఆప్షన్ అని సచిన్ అన్నాడు. అయితే ఎప్పుడు వివాదాస్పద అంశాలు, సున్నితమైన అంశాలపై ఎటువంటి కామెంట్లు చేయరు. సీనియర్​ ఆటగాళ్లంతా ఆస్ట్రేలియా టూర్​ కు ఎంపికచేసిన భారతజట్టు పై విమర్శలు గుప్పించారు. కానీ ఈ విషయంపై సచిన్​ స్పందించ లేదు. అయితే తాజాగా మయాంక్​ అగర్వాల్​ ఎంపిక సరైనదేనంటూ వ్యాఖ్యానించాడు. మరోవైపు రోహిత్​ శర్మ టెస్ట్ ​మ్యాచ్​ల్లో ఆడాలని కూడా సచిన్​ ఆకాంక్షించాడు.