Begin typing your search above and press return to search.

రష్యా మరో దుస్సాహాసం.. ఉక్రెయిన్ ప్రాంతాల విలీనం

By:  Tupaki Desk   |   29 Sep 2022 11:30 PM GMT
రష్యా మరో దుస్సాహాసం.. ఉక్రెయిన్ ప్రాంతాల విలీనం
X
ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగిన ఆ దేశం మొత్తాన్ని ఆక్రమించుకోలేకపోయింది. కానీ ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు ప్రాంతాలను కైవసం చేసుకుంది. ఆక్రమించిన నాలుగు భూభాగాలను అధికారికంగా రష్యాలో శుక్రవారం విలీనం చేస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధికారిక ప్రతినిది పెస్కోవ్ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం క్రెమ్లిన్ వేడుకలో ఈ భూభాగాల విలీనం ఉంటుందని తెలిపారు. గ్రాండ్ క్లెమ్లిన్ ప్యాలెస్ లోని జార్జియన్ హాల్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఈ కొత్త భూభాగాల విలీనం నిర్వహిస్తాని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రసంగం చేయనున్నారు.

ఉక్రెయిన్ లోని లుగాన్స్క్, డొనెట్స్క్, ఖెర్సోన్,జపోరిజాయాలను రష్యా సైన్యం ఆక్రమించింది. వీటిని రష్యాలో శాశ్వతంగా విలీనం చేసుకోవడానికి అక్కడ ఈ వారంలో రెఫరెండం నిర్వహించింది. రష్యాలో శాశ్వత విలీనాన్ని కోరుకుంటున్నట్లు రెఫరెండంలో వెల్లడైందని రష్యా వర్గాలు ప్రకటించారు. సైనిక దళాలు, ఎన్నికల అధికారులు ఐదు రోజుల పాటు ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టు తెలిపారు.

డోనెట్స్క్ ప్రాంతంలో 99 శఆతం మంది మద్దతు తెలిపారు. లుహాన్స్క్ లో 98శాతం, జపోరిజాయాలో 93 శాతం, ఖేర్సన్ లో 87 శాతం మంది విలీనానికి మద్దతుగా స్పందించారని ప్రకటించారు. ఈ నాలుగు ప్రాంతాల్లోని రష్యా మద్దతున్న నేతలు తాము మాస్కోలోనే ఉంటామని.. త్వరలోనే పుతిన్ తో సమావేశం అవుతామని తెలిపారు.

అయితే ఉక్రెయిన్ భూభాగాల విలీనాన్ని ఉక్రెయిన్ తోపాటు అమెరికా, ఐరోపా దేశాలు మాత్రం ప్రజాభిప్రాయ సేకరణను బూటకమని కొట్టిపారేశాయి.

2014లో ఉక్రెయిన్ లోని క్రిమియాను కూడా రష్యా ఇలాగే ఆక్రమించుకొని విలీనం చేసుకుంది. మళ్లీ 8 ఏళ్ల తర్వాత తాజాగా నాలుగు ప్రాంతాలను ఆక్రమించింది. యుద్ధంతో ఇప్పటికే అత్యధిక ప్రజలు ఇళ్లు వదిలి వెళ్లిపోగా.. మిగిలిన కొద్దిమందితోనే ప్రజాభిప్రాయసేకరణను బలవంతంగా నిర్వహించి ఈ తంతు ముగించారు. రష్యా సైనికులు తుపాకులతో ఇంటింటికి వచ్చి ఉక్రెయిన్ వాసులతో బలవంతంగా ఓట్లు వేయించారని పలువురు ఆరోపించారు.

ఈ నాలుగు ప్రాంతాలు రష్యాలో విలీనం అయితే ఉక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకోవడం దాదాపు అసాధ్యం. వీలినం తర్వాత ఈ నాలుగు ప్రాంతాలపై దాడిని రష్యాపై దాడిగా పరిగణిస్తామని.. అణ్వాయుధాలను ఉపయోగించడానికి సిద్ధమని పుతిన్ ప్రకటించారు. దీంతో ఉక్రెయిన్ దాదాపుగా వదిలేసుకున్నట్టే.

ఇక విలీనాన్ని గుర్తించమని పశ్చిమ దేశాల కూటమి జీ7 ఇప్పటికే స్పష్టం చేసింది. రష్యాకు హెచ్చరికలు జారీ చేసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.